AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. రెవెన్యూ, దేవదాయశాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్‌సీ ప్రకటన విడుదల చేసింది. రెవెన్యూ శాఖలో 670 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
Ap Job Notification
Sanjay Kasula
|

Updated on: Dec 28, 2021 | 9:44 PM

Share

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. రెవెన్యూ, దేవదాయశాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్‌సీ ప్రకటన విడుదల చేసింది. రెవెన్యూ శాఖలో 670 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన ఏపీపీఎస్‌సీ.. దేవదాయశాఖలో 60 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 19 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. నోటిఫికేషన్ల పూర్తి వివరాలు ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో లభిస్తాయిన పేర్కొంది. నోటిఫికేషన్ల పూర్తి వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచారు.

జిల్లాల వారీగా రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల వివరాలు: శ్రీకాకుళం-38, విజయనగరం-34, విశాఖ-43, తూ.గో-64, ప.గో-48

జిల్లాల వారీగా రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల వివరాలు: కృష్ణా-50, గుంటూరు-57, ప్రకాశం-56, నెల్లూరు-46, చిత్తూరు-66

జిల్లాల వారీగా రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల వివరాలు: అనంత-63, కర్నూలు-54, కడప-51

జిల్లాల వారీగా దేవదాయ శాఖ ఈవో గ్రేడ్‌-3 పోస్టుల వివరాలు: శ్రీకాకుళం-4, విజయనగరం-4, విశాఖ-4, తూ.గో-8, ప.గో-7

జిల్లాల వారీగా దేవదాయ శాఖ ఈవో గ్రేడ్‌-3 పోస్టుల వివరాలు: కృష్ణా-6, గుంటూరు-7, ప్రకాశం-6, నెల్లూరు-4, చిత్తూరు-1

జిల్లాల వారీగా దేవదాయ శాఖ ఈవో గ్రేడ్‌-3 పోస్టుల వివరాలు: అనంత-2, కర్నూలు-6, కడప-1

రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 18వ తేదీ అర్థరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లుగా ఏపీపీఎస్సీ తాజా ప్రకటనలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి: Minister Perni Nani: ఏ కిరాణా కొట్టు గురించి మాట్లాడారో.. నానిపై మంత్రి పేర్ని నాని సెటైర్..

Hyderabad: భాగ్యనగర సిగలో మరో మణిహారం.. ట్రాఫిక్‌ ఇక్కట్లకు చెక్.. జనవరి 1న షేక్ పేట్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం