Work From Home: కరోనా మహమ్మారితో కంపెనీలు కీలక నిర్ణయం.. శాశ్వతంగా ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌!

Work From Home: కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రం చేస్తున్నారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షలు విధించడంతో చాలా కంపెనీలు తమతమ..

Work From Home: కరోనా మహమ్మారితో కంపెనీలు కీలక నిర్ణయం.. శాశ్వతంగా ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 28, 2021 | 10:07 PM

Work From Home: కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రం చేస్తున్నారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షలు విధించడంతో చాలా కంపెనీలు తమతమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనులు చేయాలని సూచించాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్‌ ఫ్రం చేయిస్తున్నాయి. అయితే దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత మెల్లమెల్లగా ఉద్యోగులను కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. ఇక వచ్చే ఏడాది జనవరి నుంచి పూర్తి స్థాయిలో కార్యాలయాల నుంచే ఉద్యోగులతో పనులు చేయించాలనే ఉద్దేశంతో ఉన్న కంపెనీలకు.. మరో తలనొప్పిగా మారింది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వైరల్‌ వల్ల కంపెనీలు ఉద్యోగుల పట్ల పునరాలోచనలో పడ్డాయి. మళ్లీ వర్క్‌ ఫ్రం హోమ్‌కే మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడు కంపెనీలు తమ ఉద్యోగులను శాశ్వతంగా వర్క్‌ ఫ్రం హోమ్‌ ఇచ్చేందుకు అంగీకరించాయి.

స్లాక్‌ (Slack): స్లాక్‌ అనేది ఒక సాఫ్ట్‌వేర్‌ ప్లాట్‌ఫామ్‌. కరోనా మహమ్మారి సమయంలో ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా ఇంటి నుంచే పని చేసేందుకు నిర్ణయించింది. మహమ్మారి సమయంలో కాలిఫోర్నియాకు చెందిన ఎంటర్‌ ప్రైజ్‌ తన ఉద్యోగులను శాశ్వతంగా ఇంటి నుంచే వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసేందుకు అంగీకరించింది.

ట్విట్టర్‌ (Twitter): ఇక స్లాక్‌ మాదిరిగానే ట్విట్టర్‌ కూడా కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసేందుకు అంగీకరించింది. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో కార్యాలయంలో భౌతికంగా ఉండాల్సిన అవసరం ఉన్నవారు తప్ప మిగతా వారికి శాశ్వత వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసేందుకు అంగీకరిస్తోంది. ఉద్యోగులు తమకు వర్క్‌ ఫ్రం హోమ్‌ వద్దని భావించినప్పుడు కార్యాలయానికి వచ్చిన ఉద్యోగం చేసుకోవచ్చని తెలిపింది.

స్పాటిఫై (Spotify): స్వీడన్‌కు చెందిన మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ స్పాటిఫై ఫిబ్రవరిలో తన ఉద్యోగులకు ఎక్కడి నుంచైనా పనులు చేసేలా అవకాశం ఇచ్చింది. అయితే ఉద్యోగులు కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత ఇంటి నుంచైనా, కార్యాలయం నుంచైనా ఉద్యోగం చేసేందుకు ధృవీకరించింది.

టాటా స్టీల్‌ (Tata Steel): భారతదేశం స్టీల్‌ తయారీ కంపెనీ టాటా స్టీల్‌ కూడా తన ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసేందుకు అంగీకరించింది. వర్క్‌ ఫ్రం హోమ్‌ పాలసీ ఎజైల్‌ వర్కింగ్‌ మోడల్‌ అని పిలువబడే ఉద్యోగులు సంవత్సరంలో 365 రోజుల పాటు వర్క్‌ ఫ్రం హోమ్‌ను ఎంచుకునే అవకాశం ఇచ్చింది. కాగా, టాటా స్టీల్‌ ఈ ఏడాది సెకండ్‌ వేవ్‌లో ఉద్యోగులు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారికి అండగా నిలిచింది. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రతి నెల వేతనం చెల్లిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. జీతంతో పాటు వారి పిల్లల చదువు, మెడికల్‌, రెసిడెన్షి సదుపాయాలను కూడా కంపెనీ కల్పిస్తుందని వెల్లడించింది.

మెటా (Meta): గతంలో మెటా అని పిలిచే ఫేస్‌బుక్‌ సంస్థ కరోనా మహమ్మారి ప్రారంభంలో ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ను ప్రకటించింది. ఇప్పుడు కంపెనీ ఆఫీస్‌ డిఫెరల్‌ ప్రోగ్రాంను రూపొందించింది. ఇది ఉద్యోగులకు కార్యాలయాలకు తిరిగి వచ్చేందుకు సౌలభ్యాన్ని కల్పించింది. అయితే కొంత మంది ఉద్యోగులు తిరిగి వచ్చేందుకు సిద్ధంగా లేరని గుర్తించిన సంస్థ.. ఉత్తమంగా ఉండే పనిని ఎంచుకునే సదుపాయం కల్పించింది. అందుకే ఉద్యోగులు ఎక్కడి నుంచైనా ఉద్యోగం చేసేందుకు అంగీకరించింది. డిసెంబర్‌లో సోషల్‌ మీడియా టెక్‌ కంపెనీ తన యూఎస్‌లో తన కార్యాలయాలను జనవరి 31, 2022 నుంచి పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించినప్పటికీ.. కొత్త వేరియంట్‌ వ్యాప్తి, కరోనా వ్యాప్తి కారణంగా పునరాలోచనలో పడింది. ప్రస్తుతం వైరల్‌ నేపథ్యంలో ఉద్యోగులు ఎక్కడి నుంచి అయినా పని చేసేందుకు నిర్ణయాలు తీసుకోవచ్చని సంస్థ వెల్లడించింది.

మైక్రోసాఫ్ట్‌ (Microsoft): కరోనా మహహ్మారి సమయంలో మైక్రోసాఫ్ట్‌ మొత్తం హైబ్రిడ్‌ వర్క్‌ మాన్యువల్‌ను తయారు చేసింది. ఉద్యో్గులు వారంలో 50 శాతం కంటే తక్కువ సమయం ఇంటి నుంచి పని చేయడానికి వీలు కల్పించింది. కొందరికి శాశ్వతంగా ఇంటి నుంచే పని చేసేలా సదుపాయం కల్పించేందుకు నిర్ణయం తీసుకుంటోంది.

Shopify: ఈ కంపెనీ కూడా తన ఉద్యోగులను శాశ్వతంగా వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసేందుకు నిర్ణయించుకుంది. క్లౌడ్‌, మల్లీఛానల్‌, చిన్న వ్యాపార, మధ్య వ్యాపార బహుళ విక్రయ ఛానెల్‌లలో తమ స్టోర్‌లను సృష్టించడానికి, డిజైన్‌ చేయడానికి ఈ కంపెనీ సహాయ పడుతుంది. కరోనా మహమ్మారి నుంచి కంపెనీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ చేయిస్తోంది. ఇప్పుడు కంపెనీ వర్క్‌ ఫ్రం హోమ్‌ను శాశ్వతంగా మార్చేందుకు నిర్ణయించింది. ఉద్యోగులు శాశ్వతంగా వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసేందుకు నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి:

SpiceJet: విమాన ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్‌.. తక్కువ ధరతో ప్రయాణం..!

Fact Check: వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న రూ.500 నకిలీ నోటు.. ఇందులో నిజమెంత.. క్లారిటీ ఇచ్చిన ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..