అందాలతో కవ్విస్తున్న తెలుగమ్మాయి.. ఆఫర్స్ మాత్రం నిల్లు

06 December 2025

Pic credit - Instagram

Rajeev 

టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలు చాలా తక్కువమంది ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. అందులో ఒకరు ప్రియాంక జవాల్కర్.

 ప్రియాంక జవాల్కర్ గురించి తెలుగు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. మైండ్ బ్లోయింగ్ లుక్స్ తో కుర్రోళ్లను మెస్మరైజ్ చేస్తుంది 

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘టాక్సీవాలా’తో హీరోయిన్‌గా పరిచయమయ్యింది ప్రియాంక జవాల్కర్. 

‘టాక్సీవాలా’లో క్యూట్‌గా తన నటనతో ఆకట్టుకోవడంతో ప్రియాంకకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని ప్రేక్షకులు అనుకున్నారు.

అనంతపురంకు చెందిన ప్రియాంక జవాల్కర్ టాక్సీవాలా సినిమా లో తన నటనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

టాక్సీవాలా సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మరోక హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ చిన్నది.

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది ప్రియాంక.