Irfan Pathan: రెండోసారి తండ్రైన టీమిండియా మాజీ క్రికెటర్‌.. ముద్దుల కుమారుడికి ఏం పేరు పెట్టాడంటే..

టీమిండియా మాజీ స్వింగ్‌ బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ తన ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పాడు. రెండోసారి తండ్రిగా ప్రమోషన్‌ పొందినట్లు వెల్లడించాడు. తన సతీమణి సఫా పండంటి మగ బిడ్డను ప్రసవించినట్లు

Irfan Pathan: రెండోసారి తండ్రైన టీమిండియా మాజీ క్రికెటర్‌.. ముద్దుల కుమారుడికి ఏం పేరు పెట్టాడంటే..
Follow us
Basha Shek

|

Updated on: Dec 29, 2021 | 7:25 AM

టీమిండియా మాజీ స్వింగ్‌ బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ తన ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పాడు. రెండోసారి తండ్రిగా ప్రమోషన్‌ పొందినట్లు వెల్లడించాడు. తన సతీమణి సఫా పండంటి మగ బిడ్డను ప్రసవించినట్లు తెలిపాడు. అదేవిధంగా తన రెండో కుమారుడికి సులేమాన్‌ ఖాన్‌ అని పేరు పెట్టినట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు తన చిన్నకుమారుడిని ప్రపంచానికి పరిచయం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టాడు. తన ముద్దుల కుమారుడిని చేతుల్లోకి తీసుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను షేర్‌చేస్తూ.. ‘నేను, సఫా మా కుమారుడు సులేమాన్‌ ఖాన్‌ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించాం. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు. మీ అందరి దీవెనలు కావాలి’ అని పఠాన్‌ రాసుకొచ్చాడు.

స్వింగ్‌ బౌలింగ్‌తో సంచలనాలు..

కాగా గుజరాత్‌లోని బరోడాకు చెందిన ఇర్ఫాన్‌ 2003లో టీమిండియాలోకి అడుగుపెట్టాడు. ఆ ఏడాది డిసెంబరులో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌తో తన క్రికెట్‌ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. మరుసటి ఏడాదే పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లోకి అడుగుపెట్టి సత్తాచాటాడు. స్వింగ్‌ బౌలింగ్‌తో సంచలనాలు నమోదు చేసిన పఠాన్‌ అప్పుడప్పుడూ బ్యాట్‌ తోనూ మెరుపులు మెరిపించాడు. టీమిండియా తరఫున మొత్తం 120 వన్డేలు, 29 టెస్టులు, 24 టీ- 20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 306 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 2,821 పరుగులు చేశాడు. 2012లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన ఇర్ఫాన్‌ గతేడాది అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ప్రస్తుతం క్రికెట్‌ వ్యాఖ్యాతగా బిజీగా గడుపుతున్నాడు.

హైదరాబాద్‌ మోడల్‌తో నిఖా.. ఇక ఇర్ఫాన్‌ వ్యక్తిగత విషయానికి వస్తే.. హైదరాబాద్‌కు చెందిన మోడల్‌ సఫా బేగ్‌తో కలిసి 2016లో పెళ్లి చేసుకున్నాడు. అదే ఏడాది వీరికి ఇమ్రాన్‌ ఖాన్‌ పఠాన్‌ అనే మగబిడ్డ జన్మించాడు. ఇప్పుడు మరో బుజ్జాయి వీరి కుటుంబంలోకి అడుగుపెట్టాడు. ఈక్రమంలో రెండోసారి అమ్మానాన్నలైన ఇర్ఫాన్‌, సఫా దంపతులకు పలువురు క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

Also Read:

Sukumar: వాళ్ళు పడిన కష్టం అంతా ఇంతా కాదు.. పుష్ప టీమ్‌లో వారికి ఒక్కొక్కరికి లక్షరూపాయిలు ప్రకటించిన సుకుమార్..

 ‘లైగింక వేధింపులను నివారించాలంటే అమ్మాయిలు ఇలా చేయాలి’.. వివాదంగా మారిన జేఎన్‌యూ సర్క్యూలర్‌..

Silver Price Today: స్వల్పంగా పెరిగిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు ఎలా ఉన్నాయంటే..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!