PhonePe: ఫోన్ పే ధమాకా ఆఫర్.. రూ.2వేలతో బంగారం కొంటే క్యాష్‌బ్యాక్ ఎంత వస్తుందో తెలుసా..?
మీరు ఫోన్‌పే వాడుతున్నారా.. అయితే మీకు ఒక గుడ్ న్యూస్.. రూ.2,000 కన్నా ఎక్కువ 24K డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేస్తే, మీరు 2శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇది గరిష్ఠంగా రూ.2వేల వరకు ఉంటుంది. అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఇది ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది..? అది ఎప్పుడు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరు ఫోన్ పే వాడుతున్నారు. కూరగాయల నుంచి మొదలు పెద్ద పెద్ద షాపింగ్‌ల వరకు ఫోన్‌పేతోనే పేమెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫోన్‌పే ధన్‌తేరాస్‌ను దృష్టిలో ఉంచుకుని.. తమ కస్టమర్ల కోసం ఒక ప్రత్యేకమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. వినియోగదారులు తమ ప్లాట్‌ఫామ్ ద్వారా కొనుగోలు చేసే 24K డిజిటల్ గోల్డ్‌పై భారీగా డబ్బు ఆదా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
ఆఫర్ వివరాలు ఇవే
వినియోగదారులు కనీసం రూ.2,000 విలువైన బంగారం కొనుగోలుపై ఫ్లాట్ 2శాతం క్యాష్‌బ్యాక్ అంటే గరిష్టంగా రూ.2,000 వరకు పొందవచ్చు. ఈ ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్ కేవలం అక్టోబర్ 18న మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ ఆఫర్ ఒక్కో వినియోగదారుడికి ఒక్కసారి చేసిన లావాదేవీకి మాత్రమే వర్తిస్తుంది. ఫోన్‌పే కస్టమర్‌లు MMTC-PAMP, SafeGold, Caratlane వంటి నమ్మకమైన సంస్థల నుండి 99.99% స్వచ్ఛత ఉన్న 24K డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే దేశం అంతటా 1.6 కోట్లకు పైగా కస్టమర్‌లు ఫోన్‌పే ద్వారా బంగారాన్ని కొనుగోలు చేశారని కంపెనీ తెలిపింది.
బంగారం కొనుగోలుకు ఇతర పెట్టుబడి మార్గాలు
ఒకేసారి కొనుగోళ్లతో పాటు ఫోన్‌పే వినియోగదారులకు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి మరో సులభమైన మార్గాన్ని అందిస్తోంది. వినియోగదారులు రోజువారీ లేదా నెలవారీ SIPల ద్వారా కూడా బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. రూ.5 కంటే తక్కువ మొత్తంతో కూడా పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టవచ్చు. పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ఎప్పుడైనా రీడీమ్ చేసుకోవచ్చు లేదా విక్రయించవచ్చు. ఆ డబ్బు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు జమ అవుతుంది.
క్యాష్‌బ్యాక్ ఎలా పొందాలంటే..?
ఈ ప్రత్యేక ధన్‌తేరాస్ క్యాష్‌బ్యాక్ పొందడానికి వినియోగదారులు కింద ఇచ్చిన దశలను పాటించాలి:
- ఫోన్ పే హోమ్ స్క్రీన్‌పై ఉన్న ‘డిజిటల్ గోల్డ్’ పై క్లిక్ చేయండి.
- డిజిటల్ గోల్డ్ కొనండి అనే ఆప్షన్ ఎంచుకోండి.
- క్యాష్‌బ్యాక్‌కు అర్హత పొందడానికి కనీసం రూ.2,000 మొత్తాన్ని ఎంటర్ చేసి, పేమెంట్ చేయండి.
ధన్‌తేరాస్ సందర్భంగా బంగారంలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్న వారికి ఈ ఫోన్‌పే ఆఫర్ డబ్బు ఆదా చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




