Post Office: పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. ఇంటికే రైల్వే టికెట్.. ఇలా చేస్తే చాలు..
ఇకపై మీరు రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఉత్తరాలు, చిన్న పొదుపు పథకాలతో ప్రజలకు దగ్గరైన పోస్టాఫీసు ఇప్పుడు మరో అద్భుతమైన సేవను తెచ్చింది. రైల్వే కౌంటర్లు లేని ఊళ్లలో కూడా పోస్టాఫీసుల్లోనే అన్ని రకాల రైల్వే రిజర్వేషన్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు పోస్టాఫీసు ఇంటికే టికెట్‌ను డెలివరీ కూడా చేస్తుంది.

పోస్టాఫీసు అంటే ఉత్తరాలు వేయడం, చిన్న మొత్తంలో డబ్బులు దాచుకోవడం మాత్రమే కాదు. ఇప్పుడు అది ప్రజలకు మరింత దగ్గరవుతోంది. ఇప్పటికే మంచి పథకాలతో పోస్టాఫీస్ ప్రజలకు ఆర్థికంగా సపోర్ట్‌గా నిలుస్తుంది. రిస్క్ తక్కువ ఉండడంతో చాలా మంది పోస్టాఫీస్ పథకాల్లో చేరుతున్నారు. ఇప్పుడు మరో ముఖ్యమైన సేవకు శ్రీకారం చుట్టుంది. ఇకపై ఎంపిక చేసిన పోస్టాఫీసులలో రైల్వే రిజర్వేషన్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్‌లు లేదా కౌంటర్లు లేని మారుమూల ప్రాంతాల్లోని ప్రజల కోసం, రైల్వే మంత్రిత్వ శాఖతో కలిసి రైల్వే రిజర్వేషన్ టిక్కెట్లను పోస్టాఫీసుల్లో బుక్ చేసుకునే సేవను ప్రారంభించింది. ఈ సదుపాయం ద్వారా అన్ని తరగతుల రైల్వే రిజర్వేషన్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
గ్రామీణ ప్రాంతాలకు ప్రయోజనం:
రైల్ హెడ్ లేదా రైల్వే కౌంటర్లు లేని ప్రాంతాలపై దృష్టి సారించి ఈ సేవ ప్రారంభించింది. ప్రస్తుతం దేశం అంతటా 333 పోస్టాఫీసులలో రైల్వే టిక్కెట్ బుకింగ్ సేవ అందుబాటులో ఉంది. ఇందులో ఎక్కువ భాగం గ్రామీణ, పాక్షిక గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. తద్వారా రైల్వే ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తున్నాయి. ఇప్పుడు రైల్వే టికెటింగ్ సేవను జోడించడం ద్వారా తమ సేవలను మరింత విస్తరించింది. పోస్టాఫీసు ఇంటి వద్దకే రైల్వే టిక్కెట్లను డెలివరీ చేసే సేవను కూడా అందిస్తుంది.
పోస్టాఫీసులలో టిక్కెట్లను బుక్ చేసుకోవడం ఎలా?
రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణీకులు ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కౌంటర్ ఉన్న పోస్టాఫీసుకు వెళ్లాలి.
PRS కౌంటర్ ఉన్న పోస్టాఫీసు: సాధారణంగా ఇవి రైల్వే స్టేషన్ లేదా కౌంటర్లు లేని ప్రాంతాలలో ఉంటాయి. ఇండియా పోస్ట్ వెబ్‌సైట్‌లో వివరాలు తెలుసుకోవచ్చు.
ప్రయాణ వివరాలు: కౌంటర్ వద్ద ఉన్న సిబ్బందికి మీ ప్రయాణ సమాచారాన్ని తెలియజేయండి.
పేమెంట్: అక్కడ ఇచ్చిన రిజర్వేషన్ ఫాం నింపి, టికెట్ డబ్బు కట్టాలి. అంతే మీ టికెట్ బుక్ అవుతుంది.
రైల్వేలో కొత్త రిజర్వేషన్ నిబంధన
ఆధార్ ఉన్నవాళ్లకే మొదటి 15 నిమిషాలు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లో జనరల్ టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో, మొదటి 15 నిమిషాలు కేవలం ఆధార్ కార్డుతో వెరిఫై అయినవాళ్లు మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోగలరు. నిజంగా ప్రయాణం చేయాలనుకునేవాళ్లకు ముందుగా టిక్కెట్లు దొరికేలా చూడటం. రైలు బయలుదేరే తేదీకి 60 రోజుల ముందు జనరల్ రిజర్వేషన్ విండో ఓపెన్ అవుతుంది. కాగా పోస్టాఫీసు ద్వారా రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రావడంతో, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల ప్రజలు రైల్వే ప్రయాణ సేవలను మరింత సులభంగా పొందగలుగుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




