AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit cards: క్రెడిట్ కార్డు లిమిట్ పెరగాలా? సింపుల్‌గా ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!

క్రెడిట్ కార్డ్ యూజర్లు చాలాసార్లు క్రెడిట్ లిమిట్ సరిపోక ఇబ్బంది పడుతుంటారు. ఇంకాస్త ఎక్కవ లిమిట్ ఉంటే బాగుండు అనుకుంటారు. అయితే క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వడం ద్వారా ఈజీగా క్రెడిట్ లిమిట్ పెంచుకోవచ్చు. అదెలాగంటే..

Credit cards: క్రెడిట్ కార్డు లిమిట్ పెరగాలా? సింపుల్‌గా ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!
క్రెడిట్ కార్డ్ కలిగి ఉండటం, దానిని సకాలంలో చెల్లించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, మీ క్రెడిట్ కార్డ్ బిల్లును ఆలస్యంగా చెల్లించడం వల్ల అనేక నష్టాలు ఉంటాయి. మీ బిల్లును ఆలస్యంగా చెల్లించడం వల్ల గణనీయమైన వడ్డీ ఛార్జీలు విధిస్తాయి బ్యాంకులు. ఇది మీ అప్పును పెంచుతుంది. అదనంగా మీ క్రెడిట్ స్కోరు తగ్గుతూనే ఉంటుంది. మీరు చాలా కాలం పాటు మీ కార్డ్ చెల్లింపులను విస్మరిస్తూ ఉంటే మీ కార్డ్ రుణం గణనీయంగా పెరుగుతుంది.
Nikhil
|

Updated on: Oct 14, 2025 | 3:45 PM

Share

ఈ మధ్య కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం బాగా పెరిగింది. చాలామంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అయితే ప్రతి క్రెడిట్ కార్డుకి కొంత లిమిట్ ఉంటుంది. వాడకాన్ని బట్టి లిమిట్ పెరుగుతుంది. ఒకవేళ మీరు మీ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవాలి అనుకుంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

లిమిట్ ఎందుకు పెంచుకోవాలంటే..

క్రెడిట్ కార్డులు వాడేవాళ్లు లిమిట్ ను పూర్తిగా వాడుకోవడం ద్వారా సిబిల్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోర్ కోసం కార్డు లిమిట్ లో 30% లోపు మాత్రమే ఉపయోగించుకోవాలి. మరి ఇలాంటప్పుడు ఎక్కువ మొత్తంలో వాడుకోవడం కుదరదు. కాబట్టి కార్డు లిమిట్ పెంచుకోవడం ఒక్కటే ఆప్షన్. ఓవరాల్ లిమిట్ పెరిగితే వాడుకోగలిగిన మొత్తం కూడా పెరుగుతుంది. అందుకే లిమిట్ పెంచుకోవడం అవసరం.

క్రెడిట్ స్కోర్‌ ను బట్టి..

క్రెడిట్ లిమిట్ అనేది క్రెడిట్ స్కోర్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. మీ నెలవారీ ఈఏంఐలు ఎప్పుడూ స్కిప్ చేయకుండా బిల్లులు కడుతున్నట్టయితే బ్యాంకులు ఆటోమేటిక్ గా క్రెడిట్ లిమిట్ పెంచుతాయి. లేదా మీరే లిమిట్ పెంచమని రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు.

క్రెడిట్ యుటిలైజేషన్

క్రెడిట్ కార్డులు వాడేవాళ్లు క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో ఎంత ఉందో గమనిస్తుండాలి. అంటే మీకు ఉన్న అన్ని కార్డుల లిమిట్ లో మొత్తం ఎంత వాడుతున్నారు అన్నది చూసుకుంటూ ఉండాలి. మీ కార్డుల లిమిట్ లో 30% కంటే తక్కువగా యుటిలైజ్ చేసుకోవాలి. అలాగే ఆ బిల్లులను సకాలంలో కట్టాలి.

శాలరీ హైక్

మీ ఆదాయాన్ని బట్టే సంస్థలు మీకు క్రెడిట్ కార్డులు ఇస్తుంటాయి. ఒకవేళ మీ ఆదాయం లేదా శాలరీ పెరిగితే క్రెడిట్ కార్డు లిమిట్ కూడా పెరుగుతుంది. అందుకే లిమిట్ పెంచుకోవాలి అనుకునేవాళ్లు ఆదాయాన్ని కూడా పెంచుకునే ప్రయత్నం చేయాలి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం