AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maa Inti Bangaram: సమంత ఎంత గొప్ప నటినో అప్పుడే నాకు అర్థమైంది.. రాజ్ ఆసక్తికర కామెంట్స్

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా మా ఇంటి బంగారం. గతంలో సామ్ తోనే 'ఓ బేబీ' లాంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన నందినీ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Maa Inti Bangaram: సమంత ఎంత గొప్ప నటినో అప్పుడే నాకు అర్థమైంది.. రాజ్ ఆసక్తికర కామెంట్స్
Samantha Maa Inti Bangaram Pre Release Celebrations
Basha Shek
|

Updated on: Jun 15, 2026 | 11:04 PM

Share

‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో సమంత భర్త, ప్రముఖ నిర్మాత రాజ్ నిడిమోరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాను. ఈ సందర్భంగా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమ పట్ల తనకున్న గౌరవాన్ని, మక్కువను చాటుకున్నారు. తన స్నేహితులైన స్వప్న, దేవా, సురేష్‌లకు ధన్యవాదాలు తెలుపుతూ, తెలుగులో సినిమా తీయడం తనకెంతో ఇష్టమని ఆయన పేర్కొన్నారు. హిందీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు నిర్మించినప్పటికీ, తెలుగులో సినిమా ప్రారంభించాలనే ఉద్దేశంతో స్వప్న వద్దకు వచ్చానని ఆయన గుర్తుచేసుకున్నారు. తెలుగు సినిమా నిర్మించడంలో ఒక ప్రత్యేకమైన కిక్ ఉంటుందని, అది విభిన్నమైన అనుభూతిని ఇస్తుందని రాజ్ నిడిమోరు తెలిపారు.

తెలుగు ప్రేక్షకుల ప్రేమ, అభిమానం, పిచ్చి తాను మరెక్కడా చూడలేదని, తెలుగు సినిమా పరిశ్రమలో తాను చూసినంత ఉత్సాహం, శక్తి మరెక్కడా లేదని ఆయన అన్నారు. సమంత లాంటి నటితో సినిమా తీయడం అంటే ఒక పెద్ద బాధ్యత అని రాజ్ వెల్లడించారు. ఈ చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. తనతో పాటు పనిచేసిన అద్భుతమైన వ్యక్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రచనా విభాగంలో వసంత్ ఒక మూల స్తంభంగా నిలిచారని, ఎడిటింగ్‌లో ధర్మేంద్ర , అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రొడక్షన్ టీమ్, ఏడీలు, నటీనటులు అందరి కృషిని ఆయన కొనియాడారు.

నందినిని అందరూ చాలా ప్రేమిస్తారని, ఆమె పరిశ్రమకు ఒక స్నేహితురాలిగా అందరికీ తెలుసని రాజ్ నిడిమోరు పేర్కొన్నారు. ఆమెతో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవమని రాజ్ తెలిపారు. బంగారం షూటింగ్ చేస్తున్నప్పుడు తాను ఒక విషయాన్ని గ్రహించానని, కొన్ని సన్నివేశాలను తాము రాసినప్పటికీ, సమంత వచ్చి మొదటి టేక్‌లోనే అద్భుతంగా నటించి ఆశ్చర్యపరుస్తుందని ఆయన అన్నారు. సమంత ఎంత గొప్ప నటినో ఆ క్షణంలో తాను గ్రహించానని తెలిపారు. సమంతతో పనిచేయడం చాలా ఉత్సాహంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాకు వస్తున్న ఉత్సాహం అపూర్వమైనదని రాజ్ నిడిమోరు తెలిపారు. విడుదల కంటే ముందే తిరుపతి నుంచి తనకు ఫోటోలు వస్తున్నాయని, తన తల్లి కాలేజీ బయట ఒక హోర్డింగ్ పెట్టారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హిందీలో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ, ఈ సినిమాకు వస్తున్నంత ఎక్సైట్‌మెంట్ తాను మొదటిసారి చూస్తున్నానని రాజ్ నిడిమోరు అన్నారు. అమెరికాలో కూడా ఇదే విధమైన స్పందన వస్తుందని చెప్పారు. ఈ ఉత్సాహం థియేటర్లకు చేరి, అందరూ మొదటి రోజే సినిమాను చూడాలని రాజ్ ఆకాంక్షించారు.

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us