AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maa Inti Bangaram: ఇప్పటివరకు సమంత సంపాదించుకున్న గొప్ప ఆస్తి ఇదే.. రాహుల్ రవీంద్రన్ కామెంట్స్

సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా మా ఇంటి బంగారం. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం (జూన్ 15) ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు.

Maa Inti Bangaram: ఇప్పటివరకు సమంత సంపాదించుకున్న గొప్ప ఆస్తి ఇదే.. రాహుల్ రవీంద్రన్ కామెంట్స్
Maa Inti Bangaaram Pre Release Celebrations
Basha Shek
|

Updated on: Jun 15, 2026 | 11:21 PM

Share

‘మా ఇంటి బంగారం” చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక సోమవారం (జూన్ 15) అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సమంతను ఉద్దేశించి ఆయన చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గామారాయి. ‘ ఇప్పుడు నేను చాలా ఎమోషనల్ గా ఉన్నాను. సమంత నటించిన ఈ సినిమాను తెలుగు థియేటర్లలో, రెండు రాష్ట్రాల్లోని ప్రేక్షకుల మధ్య చూడాలని, వారితో కలిసి చప్పట్లు కొట్టాలని కొన్నేళ్లుగా నేను ఎదురుచూస్తున్నాను’ అని రాహుల్ రవీంద్రన్ పేర్కొన్నారు. ఇదే క్రమంలో సమంతతో తనకున్న అనుబంధాన్ని చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యారు రవీంద్రన్. జీవితంలో కుటుంబ సభ్యులు కాకుండా, అదృష్టం ఉంటే ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు మనకు తోడుగా నిలుస్తారన్నారు. అలాంటివారు మన కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారని, అలాగే వారి కోసం మనం కూడా ఏదైనా చేయడానికి సంసిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. వారితో ఒక చెడు వార్త పంచుకుంటే బాధ తగ్గుతుందని, ఒక శుభవార్త చెబితే సంతోషం రెట్టింపు అవుతుందన్నారు. అలాంటి విలువైన సంబంధాలే మనం జీవితంలో సంపాదించుకునే అసలైన ఆస్తి అని, అంత కంటే ముఖ్యమైన సంపదను జీవితంలో ఎవరూ సంపాదించలేరని రాహుల్ రవీంద్రన్ నొక్కిచెప్పారు.

ఈ సందర్భంగా, సమంతను ఉద్దేశిస్తూ “నేను నా లైఫ్‌లో సంపాదించుకున్న ఆస్తి ఈ అమ్మాయి. సామ్ మా ఇంటి బంగారం, బికాజ్ షి ఈజ్ ఫ్యామిలీ” అని రాహుల్ రవీంద్రన్ అన్నారు. సమంతను కేవలం తన కుటుంబ సభ్యురాలిగానే కాకుండా, రెండు రాష్ట్రాల్లోని ఎన్నో కుటుంబాలు ఆమెను తమ ఇంటి బంగారంలా భావిస్తాయని, అది సమంత సంపాదించుకున్న గొప్ప ఆస్తి అని ఈ డైరెక్టర్ ప్రశంసించారు. ఇన్నేళ్లుగా సమంతను తెలుసుకోవడం, ఆమె పట్ల ప్రజలకున్న ప్రేమను చూడటం తన జీవితంలో అత్యంత సంతోషకరమైన అనుభవాలలో ఒకటి అని రాహుల్ తెలిపారు.

సమంత ద్వారా తనకు పరిచయమైన వారిని కూడా రాహుల్ ప్రస్తావించారు. “ఈ బంగారం వల్ల నాకు పరిచయమైన ఇంకో బంగారం మా నందు (డైరెక్టర్ నందినీ రెడ్డ) అని, ఆమె అంటే తనకు ఎంత ఇష్టమో, ఆమె సినిమాలకు తాను ఎంత మద్దతు ఇస్తానో తెలియజేశారు. ఇటీవల సమంత ద్వారా తనకు పరిచయమైన రాజ్ (రాజ్ నిడిమోరు) ను “బంగారం” అని అభివర్ణించారు రాహుల్. ఇంతమంది “బంగారం”లు కలిసి ఈ సినిమా చేస్తుండటం సంతోషంగా ఉందని రాహుల్ అన్నారు.

తన భార్యకు ఒక సూపర్ హిట్ పాటను అందించిన సినిమా “మా ఇంటి బంగారం” అని చెబుతూ, ఈ చిత్రం పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. చివరగా, చిత్ర బృందానికి మరియు నటీనటులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగాన్ని ముగించారు. వేడుకలో భాగంగా, రాహుల్‌కు దోసలు వేయడం వచ్చా అనే సరదా ప్రశ్నకు “రాదు” అని చెప్పి, ఆ తర్వాత “వచ్చింది” అని సమంత దోసలు ఎంత బాగా చేస్తుందో తాను కూడా అంత బాగా చేస్తానని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏడేళ్ల చిన్నారి మహాదానం.. అవయవదానం చేసి ఆరుగురికి కొత్త జీవితం
ఏడేళ్ల చిన్నారి మహాదానం.. అవయవదానం చేసి ఆరుగురికి కొత్త జీవితం
మెరుగైన విద్యకు కేరాఫ్. ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
మెరుగైన విద్యకు కేరాఫ్. ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..