అమెరికా-ఇరాన్ ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గాయి. హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంతో బ్యారెల్ ధర 120 డాలర్ల నుండి 80 డాలర్లకు పడిపోయింది. భారతదేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు యుద్ధం పేరుతో పెంచబడిన నేపథ్యంలో, ఇప్పుడు తగ్గిన క్రూడ్ ధరల ప్రయోజనం సామాన్యులకు బదిలీ అవుతుందా? తగ్గితే ఎంత, ఎప్పుడు తగ్గుతుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.