ఏఐ ఉద్యోగాలను తగ్గిస్తుందనే అపోహను అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఖండించారు. ఏఐ ఉత్పాదకతను పెంచుతుందని, కొత్త పరిశ్రమలను సృష్టిస్తుందని, తద్వారా మరిన్ని ఉద్యోగాలను కల్పిస్తుందని ఆయన అంటున్నారు. గతంలో కరెంట్, ఇంటర్నెట్ వచ్చినప్పుడు కలిగిన భయాల వంటిదే ఇది. ఏఐని స్వీకరించడం ద్వారా భవిష్యత్తును నిర్మించుకోవాలని బెజోస్ సూచించారు.