Gold Price Today: ఇది గమనించారా.! మళ్లీ బంగారం ధరలు తగ్గాయోచ్.. తులం ఎంతంటే

బంగారం ధరలు తగ్గుతున్నాయ్. నవంబర్ నెల మొదటి నుంచి గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్ ఇస్తూ.. తగ్గుముఖం పట్టాయి. మరి హైదరాబాద్‌లో తులం బంగారం ఎలా ఉందంటే..

Gold Price Today: ఇది గమనించారా.! మళ్లీ బంగారం ధరలు తగ్గాయోచ్.. తులం ఎంతంటే
Gold PriceImage Credit source: Getty Images
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 04, 2024 | 7:56 AM

బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి. నవంబర్ నెల మొదటి రోజు నుంచి గోల్డ్ రేట్స్ తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన నాలుగు రోజుల్లో 24 క్యారెట్ల బంగారంపై ఏకంగా రూ. 940 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారం రూ. 860 తగ్గింది. అటు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. నెల మొదటి నాలుగు రోజుల్లో ఏకంగా రూ. 3100 మేరకు వెండి ధరలు తగ్గాయి. సోమవారం దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,790 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,540గా ఉంది. ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,690 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,390గా ఉంది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, పూణే, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,690 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,390గా కొనసాగుతోంది.

వెండి ధరలు..

నిన్నటితో పోలిస్తే సోమవారం వెండి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. కిలో వెండి రూ. 100 మేరకు తగ్గింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి రూ. 96,900 ఉండగా.. చెన్నై , హైదరాబాద్, కేరళ, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి రూ. 1,05,900గా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ ధరలు సోమవారం ఉదయం ఆరు గంటలకు నమోదైనవిగా గమనించగలరు. బంగారం కోనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు చెక్‌ చేసుకోవడం బెటర్‌. ఇక లేటెస్ట్‌ బంగారం ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..