Allu Arjun – Boney Kapoor: అందులో అల్లు అర్జున్ తప్పు లేదు.. సంధ్య థియేటర్ ఘటనపై నిర్మాత బోనీ కపూర్ రియాక్షన్..
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ ను బాధ్యుడిని చేయడం సరికాదన్నారు బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్. ఆ ఘటనలో బన్నీని తప్పుపట్టాల్సిన అవసరం లేదని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీ కపూర్ సౌత్ హీరోలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సంధ్య థియేటర్ తొక్సిసలాట ఘటనపై స్పందించారు. “సౌత్ ఇండియన్ అడియన్స్ కు సినీతారలపై అభిమానం ఎక్కువే. ఒకసారి అజిత్ సినిమా కోసం అర్దరాత్రి షోకు వెళ్లాను. అక్కడ దాదాపు 25వేల మంది ఉన్నారు. అంతమందిని చూడడం అదే మొదటిసారి. సినిమా పూర్తయ్యాక తెల్లవారుజామున 4 గంటలకు బయటకు వచ్చే సమయానికి కూడా ఎంతోమంది అడియన్స్ బయట ఎదురుచూస్తున్నారు. అజిత్ మాత్రమే కాదు.. చిరంజీవి, రజనీకాంత్, అల్లు అర్జున్ లాంటి హీరోల సినిమాలకు మొదటి రోజు ప్రేక్షకులు చాలామంది వస్తారు. ఆరోజు థియేటర్ దగ్గర కొన్ని వేల మంది ఉన్నారు. అంత మందిని చూడడం అదే మొదటిసారి. అనుకోకుండా జరిగిన ఘటనకు అల్లు అర్జున్ను మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదు. ఆ ఘటనలో అల్లు అర్జున్ను తప్పు పట్టాల్సిన అవసరం లేదు” అని అన్నారు.
అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ.1700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతకు ముందు రోజు డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో ప్రదర్శించగా.. హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడడంతో అతడికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గత నెలలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బన్నీ మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు.
ఇదిలా ఉంటే.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై బోనీ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పుష్ప 2సినిమాకు డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా.. ఇందులో రష్మిక మందన్నా, ఫహద్ ఫాసిల్, అనసూయ, సునీల్, జగపతి బాబు కీలకపాత్రలు పోషించారు. ఇందులో శ్రీలీల స్పెషల్ సాంగ్ తో అలరించగా.. రాక్ స్టా్ర్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.