UI Movie In OTT: అప్పుడే ఓటీటీలోకి ఉపేంద్ర యూఐ మూవీ! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా యూఐ. డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ పాన్ ఇండియా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మెరుగైన వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి రానుంది.

UI Movie In OTT: అప్పుడే ఓటీటీలోకి ఉపేంద్ర యూఐ మూవీ! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Upendra Ui Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 02, 2025 | 3:46 PM

ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన సినిమా యూఐ. రిలీజ్ కు ముందే ఆసక్తిరేపిన ఈ సినిమా డిసెంబర్ 20న గ్రాండ్ పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదలైంది. అంచనాలకు తగ్గట్టుగానే మంచి కలెక్షన్లు రాబట్టింది. సాధారణ ప్రేక్షకులకు పెద్దగా ఆక్టటుకోలేకపోయినప్పటికీ ఉప్పీ అభిమానులను యూఐ సినిమా తెగ నచ్చేసింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లనే రాబట్టింది. అయితే కన్నడ నాట యూఐ విడుదలైన కొద్ది రోజులకే సుదీప్ నటించిన ‘మ్యాక్స్’ సినిమా విడుదల కావడంతో ఉప్పీ సినిమాకు ప్రతికూలంగా మారింది. దీంతో ఇప్పుడు యూఐ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. కాబట్టి థియేటర్లలో సినిమా మిస్ అయిన వారు ఎంచెక్క ఓటీటీలో ఉప్పీ సినిమాను చూడవచ్చు. యూఐ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. సినిమా స్ట్రీమింగ్ గురించి సన్‌నెక్స్ట్ ఎలాంటి సోషల్ మీడియా పోస్ట్‌లను షేర్ చేయనప్పటికీ, మరికొద్ది రోజుల్లో యూఐ సినిమా సన్‌నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది. ఉపేంద్ర నటించిన ‘ముకుంద మురారి’ కూడా ఇప్పటికే సన్ నెక్ట్స్ లో వీక్షించడానికి అందుబాటులో ఉంది. ఇప్పుడు ‘యుఐ’ సినిమా కూడా ఈ ఓటీటీలోనే విడుదలకు సిద్ధంగా ఉందని సమాచారం.

సన్ నెక్స్ట్ ఓటీటీలో తమిళ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. హిందీ, ఇంగ్లీష్ సినిమాలు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే యూఐ సినిమా సన్ నెక్ట్స్ లోనే స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఖచ్చితమైన తేదీ తెలియనప్పటికీ, ఈ నెల 15 తర్వాత ఉప్పీ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

యూఐ సినిమాలో ఉపేంద్ర..

కాగా యూఐ సినిమాతో చాన్నాళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టుకున్నారు హీరో ఉపేంద్ర. ఆమిర్ ఖాన్, నాగార్జున, అల్లు అర్జున్ తదితరులు సినిమాకు శుభాకాంక్షలు తెలిపారు. విడుదలైన తొలిరోజే దాదాపు ఏడు కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ‘యుఐ’ సినిమా బాగా నచ్చింది. ఈ చిత్రంలో రీష్మా నానయ్య ప్రధాన పాత్ర పోషించారు. లహరి వేలు, కేపీ శ్రీకాంత్‌లు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు.

ఉపేంద్ర యూఐ సినిమా తెలుగు టీజర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.