29 December 2024
Subhash
ఆపిల్ మొబైల్ ఫోన్లు అంటే అందరికి పిచ్చి. ఎంత ఖరీదైనదిగా ఉన్నా ఐఫోన్ కొనాలని ఆశగా ఉంటారు. ఆపిల్ ఫోన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ తగ్గింపు తర్వాత దాని ధర గణనీయంగా పడిపోయింది.
ఐఫోన్ 15 లాంచ్ ధర రూ.69,900 ఉంది. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర 14 శాతం తగ్గింపుతో రూ.59,999కే లభిస్తుంది.
దీంతో పాటు మీరు మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ పెట్టడం ద్వారా కొనుగోలు చేయవచ్చు. మీ ఐఫోన్ 15 (128GB) కేవలం రూ.24,499కే పొందే అవకాశం ఉంటుంది.
దీని కోసం మీరు ఆపిల్ సిరీస్ ఐఫోన్ 14ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. దాని విలువ రూ.35,500 వరకు ఉంటుంది.
ఆపిల్ మొదట డైనమిక్ ఐలాండ్ టెక్నాలజీని ఐఫోన్ 15లోనే ఉపయోగించింది. డైనమిక్ ఐలాండ్ ఐఫోన్ 15 డిజైన్‌ను చాలా ప్రీమియంగా చేసింది.
ఐఫోన్ 15లో కెమెరా 48MP ప్రైమరీ కెమెరా ఉంది. ఇందులో క్వాడ్ సెన్సార్ , వేగవంతమైన ఆటో ఫోకస్ కోసం 100 శాతం ఫోకస్ పిక్సెల్‌లు ఉన్నాయి.
Hexa-core Apple A16 Bionic ప్రాసెసర్ కూడా ఫోన్‌లో ఉంది. అప్‌డేట్‌లతో ఫోన్ కొత్త OSని పొందుతుంది. ఇందులో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించింది.