- Telugu News Photo Gallery Business photos Swiggy on the path of IPO, Ready for purchases in next week, Swiggy IPO details in telugu
Swiggy IPO: ఐపీఓ బాటలో స్విగ్గీ.. మరో వారం రోజుల్లో కొనుగోళ్లకు సిద్ధం
ప్రస్తుత రోజుల్లో ప్రముఖ కంపెనీలు వ్యాపార విస్తరణ కోసం ఐపీఓల బాట పడుతున్నాయి. ముఖ్యంగా ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంతో పాటు భారీ స్థాయిలో పెట్టుబడుల కోసం ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్( ఐపీఓ)లకు వస్తున్నాయి. ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ అయిన స్విగ్గీ గతంలోనే ఐపీఓ బాట పడుతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో పెట్టుబడిదారులు స్విగ్గీ కంపెనీలో పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడి విషయంలో స్విగ్గీ ఐపీఓ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Srinu |
Updated on: Nov 03, 2024 | 7:30 PM

స్విగ్గీ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) నవంబర్ 6, 2024న సభ్యత్వం కోసం తెరుస్తారు. పబ్లిక్ ఇష్యూ నవంబర్ 8 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం తెరిచి ఉంటుంది.

ఐపీఓ విలువ రూ. 11,327.43 కోట్లు, స్విగ్గీ ఐపీఓకు సంబంధించిన ఇష్యూ ధర ఒక్కో షేరుకు రూ. 371 నుంచి రూ. 390 మధ్య నిర్ణయించారు.

రిటైల్ ఇన్వెస్టర్లు రూ. 14,820 విలువైన 38 షేర్లను కొనుగోలు చేయవచ్చు. గరిష్టంగా రూ. 192,660 విలువైన 13 లాట్‌లను కొనుగోలు చేయవచ్చు.

హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్ (హెచ్ఎన్ఐ) కోసం కనీస లాట్ 14, దీని విలువ రూ. 207,480గా ఉంది. హెచ్ఎన్ఐ రూ. 992,940 ఉండగా గరిష్టంగా 67 లాట్‌లను కొనుగోలు చేయవచ్చు. ఐపీఓ కోసం తాత్కాలిక కేటాయింపు తేదీ నవంబర్ 11గా ఉంది.

లింక్‌ఇన్‌టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది స్విగ్గీ ఐపీఓకు సంబంధించిన అధికారిక రిజిస్ట్రార్‌గా ఉంది. స్విగ్గీ షేర్లు నవంబర్ 13న ఎన్ఎస్ఈ, బీఎస్ఈరెండు ఎక్స్ఛేంజీలలో ప్రారంభమవుతాయి.





























