- Telugu News Photo Gallery Excessive garlic consumption during summer health risks in telugu lifestyle news
Summer Tips: వేసవిలోనూ వెల్లుల్లిని ఎక్కువగా తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
కరోనా తరువాత ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. రోగాలకు దూరంగా ఉండాలనే భావనతో చాలా మంది తమ ఆరోగ్యం, ఆహారం పట్ల ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకునేలా సరైనా ఆహారాన్ని ఎంచుకుంటున్నారు. మంచి డైట్ ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఎక్కువ మంది వెల్లుల్లి తింటుంటారు. వెల్లుల్లి రోగ నిరోధక శక్తిని పెంచుతుందని చెబుతారు. అందుకే చాలా మంది ప్రతి రోజు ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకుంటారు. కాని వేసవిలో వెల్లుల్లి ఎక్కువగా తింటే ఏమౌతుందో తెలుసా..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం...
Updated on: Mar 22, 2025 | 4:46 PM

వెల్లుల్లి మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది జలుబు, దగ్గు, ఆస్తమా వంటి వాటికి ఉపయోగకరంగా పనిచేస్తుంది. అంతేకాదు..అధిక రక్తపోటును తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వెల్లుల్లి సహాయపడుతుంది. వెల్లుల్లిలో ఉండే అలర్జీ, బ్యాక్టీరియా నిరోధక లక్షణాలు తలనొప్పి, మతిమరుపు, దంతాల నొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.

వేసవిలో శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్‌లో చల్లని పదార్థాలు తినాలని, వేడిగా ఉండే ఆహారాలను తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే, వెల్లుల్లిలో విటమిన్ ఎ, బి, సి వంటి పోషకాలు ఉన్నాయి. ఐరన్, కొవ్వు, ప్రోటీన్లు కూడా ఉన్నాయి. వెల్లుల్లిలో ఉండే పోషకాలు మనల్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటానికి సహాయపడతాయి. శరీర ఉష్ణోగ్రతను కూడా కంట్రోల్ చేస్తాయి.

అయితే, వేసవిలో కూడా వెల్లుల్లిని ఎక్కువగా తినటం వల్ల ఏవైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా..? అనే సందేహం మీలో కూడా ఉండి ఉంటుంది.. కానీ, వేసవిలో వెల్లుల్లిని అవసరమైన మేరకు తీసుకుంటే ఎలాంటి హాని ఉండదని నిపుణులు చెబుతున్నారు.. ఎందుకంటే..

వెల్లుల్లిలో శరీర ఉష్ణోగ్రతను పెంచే గుణాలు ఉన్నాయి. కాబట్టి వేసవిలో వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటే అలర్జీ వంటి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.. ముఖ్యంగా వేసవిలో వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటే శరీర వేడి పెరిగి అసౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు.

అలాగే వెల్లుల్లిలో అల్లిసిన్ అనే కాంపోజిషన్ ఉండటం వల్ల దీన్ని ఎక్కువగా తీసుకుంటే లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా పచ్చి వెల్లుల్లిని వేసవిలో తినడం అంత మంచిది కాదని అంటున్నారు.. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిదే కానీ వేసవిలో దీన్ని అతిగా తినకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు.





























