గుమ్మడి గింజలు రోజూ తింటున్నారా..? ఈ భయంకరమైన సమస్యలు మీ నుంచి పరారైనట్టే..!
అన్ని కూరగాయల మాదిరిగానే గుమ్మడికాయ కూడా కొందరు ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ, వారిలో కొందరు గుమ్మడికాయను తిని దాని విత్తనాలను పడేస్తుంటారు.. కానీ అలా చేయడం వలన పోషకాలను పొందలేరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. తరచూ.. గుమ్మడి గింజలు ఆహారంలో భాగంగా తీసుకుంటే.. అనేక అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పలు రకాలైన భయంకర వ్యాధులను దూరం చేసుకోవచ్చునని చెబుతున్నారు.
Updated on: Mar 22, 2025 | 5:06 PM

గుమ్మడి గింజల్లో వివిధ రకాల యాంటీఆక్సిడెంట్స్, క్యాల్షియం, ఐరన్, ప్రొటీన్, పొటాషియం, పాస్పరస్, విటమిన్ ఎ, బి, సి, డి, బి12 వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గుమ్మడి గింజల్లోని పోషకాలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. దీనిలోని పీచు పదార్థం గుండెకు రక్తప్రసరణ సక్రమంగా సాగేలా చూస్తుంది.

గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియం, జింక్, ఇనుము, పొటాషియం వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడేవారు గుమ్మడి గింజలు తినడం వల్ల టెన్షన్ తగ్గుతుంది. మధుమేహం బాధితులు రోజూ స్పూన్ గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉంచుతుంది.

వయసు పైబడిన మగవారిలో తరచూ మూత్రానికి వెళ్లాల్సిరావడం వెనుక షుగర్ జబ్బుతోపాటు ప్రొస్టేట్ గ్రంధి పెరుగుదల కూడా ఓ కారణమేనని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఇది కొంతమందిలో ప్రొస్టేట్ క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉందని చెబుతున్నారు. రోజూ గుమ్మడి గింజలు తినడం వల్ల ప్రొస్టేట్ గ్రంధి వాపు రాకుండా జాగ్రత్త పడవచ్చు అంటున్నారు.

గుమ్మడి గింజలలో యాంటీఆక్సిడెంట్స్, మినరల్స్ అధికంగా ఉండటం వల్ల మూత్రపిండాల పనితీరు బాగుంటుంది. వీటిని తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాదు...నిద్రలేమి సమస్య దూరమవుతుంది.

బరువు తగ్గాలనుకునేవారికి గుమ్మడి గింజలు ఎంతగానో మేలు చేస్తాయి. ప్రతి రోజూ టేబుల్‌స్పూన్ చొప్పున గుమ్మడి గింజలు తినడం వల్ల పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. దీంతో ఎక్కువగా తినకుండా ఉంటారు. దాంతో పాటుగానే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.





























