Neem Skin Care: వేప నూనెతో మెరిసే అందం.. పట్టులాంటి చర్మం కోసం ఇలా ట్రై చేయండి…
వేప..ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్న ఔషధ మూలికల నిధి. వేపతో నయం చేయలేని చర్మ సంబంధిత వ్యాధి ఏదీ లేదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేప నూనె చర్మం మీదమొటిమలు, సోరియాసిస్, దురద, రింగ్‌వార్మ్ మొదలైన వాటిని తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. వేప నూనెలో విటమిన్ E, అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని లోపలి నుండి పోషించడానికి పనిచేస్తాయి. అంతేకాదు..వేప నూనె దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్లను తొలగించడానికి కూడా ఉపయోగించబడుతుంది. చర్మానికి వేప నూనె రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం...
Updated on: Mar 22, 2025 | 5:51 PM

వేపలోని యాంటీసెప్టిక్, యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అన్నీ ఈ వేప నూనెలో కూడా ఉంటాయి. ఇవి ముఖం, జుట్టుకు మేలు చేస్తాయి. వేపనూనెలో యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది వయస్సు పైబడిన ఆనవాళ్లు కనిపించకుండా చేస్తుంది. ముఖం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ముఖానికి వేప నూనెను అప్లై చేయటం వల్ల ముడతలు తగ్గుతాయి. ముఖం మృదువుగా, కాంతివంతంగా కనిపిస్తుంది.

రోజూ ముఖానికి వేపనూనెను రాసుకోవటం వల్ల ముఖం పొడిబారడం తగ్గుతుంది. ఇది ముఖం మెరిసేలా చేస్తుంది. వేపనూనెలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. ముఖానికి వేప నూనె రాసి 15 నుంచి 20 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవచ్చు.

ఇది చర్మం లోపల కొల్లాజెన్‌ను పెంచుతుంది. చర్మాన్ని మృదువుగా కనిపించేలా చేస్తుంది. వేప నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ముఖానికి అప్లై చేసినప్పుడు ఇది మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతుంది. వేప నూనెను ఆలివ్ నూనెతో కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయటం వల్ల రెట్టింపు ప్రయోజనం ఉంటుంది.

వేప నూనె జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జుట్టును బలపరుస్తుంది. చుండ్రును కూడా తొలగిస్తుంది. మీరు రాత్రి పడుకునే ముందు వారానికి 3 సార్లు వేప నూనె రాయవచ్చు. వేపనూనెలో ఉండే మూలకాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అంతేకాకుండా ముఖంపై మొటిమలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మీరు మొటిమలను త్వరగా తొలగించాలనుకుంటే, ప్రతి రాత్రి మీ ముఖానికి అప్లై చేయండి.

ముఖం మీద వేప నూనెను అప్లై చేసి 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మాన్ని వేగంగా రిపేర్ చేస్తుంది. ఇది UV కిరణాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇది చర్మ రంధ్రాలలోకి చొచ్చుకుపోయి ముఖాన్ని టోన్ చేస్తుంది.ముఖాన్ని కాంతివంతంగా, అందంగా మారుస్తుంది.. వేప నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలను తొలగించడంలో సహాయపడతాయి.





























