- Telugu News Photo Gallery Cinema photos Prabhas Eshwar Movie Actress Sridevi Vijaykumar Stunning Photos Goes Viral
Sridevi Vijaykumar: కుర్రబ్యుటీలకు టెన్షన్ పుట్టిస్తోన్న ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్.. స్టన్నింగ్ లుక్స్‌తో ఇలా..
తెలుగులో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన మొదటి సినిమా ఈశ్వర్. ఈ మూవీతో కథానాయికగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శ్రీదేవి విజయ్ కుమార్. ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి మాయమయ్యింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది శ్రీదేవి.
Updated on: Mar 22, 2025 | 5:40 PM

శ్రీదేవి విజయ్ కుమార్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. ప్రభాస్ హీరోగా పరిచయమైన ఈశ్వర్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే కుర్రాళ్ల హృదయాలను దొచేసింది ఈ వయ్యారి.

దాదాపు 22 ఏళ్ల క్రితం కథానాయికగా వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో కుర్ర హీరోయిన్లకు గుబులు పుట్టిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

అప్పట్లో ప్రభాస్, శ్రీదేవి విజయ్ కుమార్ జోడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఈశ్వర్ సినిమా తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యింది. తమిళంలో కొన్ని సినిమాలు చేసింది.

చాలా కాలం తర్వాత మరోసారి బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చింది. తమిళంలో పలు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరించింది. ఇక ఇప్పుడు తెలుగులో మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యింది శ్రీదేవి.

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో శ్రీదేవి విజయ్ కుమార్ చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూనెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్. అప్పటికీ.. ఇప్పటికీ ఏమాత్రం మారలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.





























