AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NSE: ఇన్వెస్టర్లకు శుభవార్త.. మున్సిపల్ బాండ్ వెబ్‌సైట్‌ని ఆవిష్కరించిన ఎన్‌ఎస్‌ఈ

దేశంలో మున్సిపల్ బాండ్లను పటిష్టం చేసేందుకు ఎన్‌ఎస్ఈ ముందుకొచ్చింది. ఇందుకోసం కొత్త చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే మున్సిపల్ బాండ్లకోసం ప్రత్యేక వెబ్ సైట్ ను ఆవిష్కరించింది. మునిసిపల్‌ బాండ్స్‌పై అవగాహన, పారదర్శకత, అమ్మకాలు, కొనుగోళ్లకు కూడా ఈ వెబ్‌సైట్‌ ఎంతగానే ఉపయోగపడనుంది. భారతదేశంలో మున్సిపల్ బాండ్ల మార్కెట్‌లో పారదర్శకత, సౌలభ్యం మరియు పెట్టుబడిదారుల అవగాహనను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.

NSE: ఇన్వెస్టర్లకు శుభవార్త.. మున్సిపల్ బాండ్ వెబ్‌సైట్‌ని ఆవిష్కరించిన ఎన్‌ఎస్‌ఈ
Nse Muncipal Bonds Website
Bhavani
|

Updated on: Mar 23, 2025 | 1:50 PM

Share

ఈ వెబ్‌సైట్‌లో మార్కెట్లో ఉన్న మునిసిపల్‌ బాండ్స్‌ ఇష్యూలు, వాటి పరపతి రేటింగ్‌, ట్రేడవుతున్న బాండ్ల సంఖ్య, ఆయా బాండ్స్‌పై లభించే నికర రాబడులు, వాటి ప్రస్తుత ధర, నిఫ్టీ ఇండియా మునిసిపల్‌ బాండ్‌ ఇండెక్స్‌ పనితీరుతో సహా సమగ్ర సమాచారం ఉంటుందని తెలిపింది. సెబీ పూర్తికాల సభ్యుడు అశ్వనీ భాటియా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆధ్వర్యంలో భారతీయ మున్సిపల్ బాండ్ల కోసం ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ వెబ్‌సైట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు పాల్గొనేవారికి కేంద్రీకృత వేదికగా పనిచేయనుంది. భారతీయ మున్సిపల్ బాండ్ల మార్కెట్‌కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇది అందిస్తుంది. నిర్మాణాత్మక సమాచారం, సంబంధిత నవీకరణలను అందించడం ద్వారా, మున్సిపల్ బాండ్లను ఆకర్షణీయమైన పెట్టుబడి మార్గంగా బలోపేతం చేయడానికి ఈ వెబ్‌సైట్ దోహదపడనుంది. www.IndiaMunicipalBonds.com లో ఈ వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు.

వెబ్‌సైట్‌లోని ముఖ్య అంశాలు:

1. బాండ్ల అన్వేషణ: వినియోగదారులు క్రెడిట్ రేటింగ్, మెచ్యూరిటీ వంటి అంశాల ఆధారంగా ఉన్న మున్సిపల్ బాండ్లను ఫిల్టర్ చేసి విశ్లేషించవచ్చు. ఇతర బాండ్లను సరిపోల్చవచ్చు. 2. మున్సిపల్ బాండ్ ఇండెక్స్: నిఫ్టీ ఇండియా మున్సిపల్ బాండ్ ఇండెక్స్ ద్వారా మున్సిపల్ బాండ్ల మార్కెట్ చారిత్రక పనితీరును ట్రాక్ చేయవచ్చు. సంబంధిత ఇతర బాండ్ ఇండెక్స్‌లతో పోల్చవచ్చు. 3. మార్కెట్ కార్యకలాపాలు : వివిధ కాల వ్యవధుల్లో మున్సిపల్ బాండ్ జారీదారుల ద్వారా సగటు రోజువారీ ట్రేడింగ్ విలువలను ట్రాక్ చేయవచ్చు. 4. సమాచార వనరులు: మున్సిపల్ బాండ్ల మార్కెట్‌కు సంబంధించిన నివేదికలు, వ్యాసాలు, మార్గదర్శకాలు, నియమ నిబంధనలు ఈ విభాగంలో అందుబాటులో ఉంటాయి.

సమాచార అంతరాన్ని తగ్గిస్తుంది…

వెబ్ సైట్ ఆవిష్కరణ సందర్భంగా అశ్వనీ భాటియా మాట్లాడుతూ, “మున్సిపల్ బాండ్ల కోసం ఒక ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఇది భారతదేశంలో మున్సిపల్ బాండ్ల మార్కెట్ విశ్వసనీయత, దృశ్యమానతను గణనీయంగా పెంచుతుంది. ఈ వెబ్‌సైట్ సమాచార అంతరాన్ని తగ్గించి, పట్టణ అభివృద్ధి ప్రాజెక్టుల ఆర్థిక సహాయంలో పెట్టుబడిదారులను పాల్గొనేలా ఆకర్షిస్తుంది. మున్సిపాలిటీలు మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు సేకరించే ప్రయత్నంలో ఇటువంటి చర్యలు బలమైన మున్సిపల్ బాండ్ల మార్కెట్‌ను నిర్మించడంలో కీలకం. ఈ వేదికను ఉపయోగించి మున్సిపల్ బాండ్ల పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, స్థిరమైన పట్టణ అభివృద్ధిని సాధించాలని ఆశిస్తున్నాం” అని అన్నారు.

కీలక ముందడుగు..

ఎన్‌ఎస్‌ఈ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ అశీష్‌కుమార్ చౌహాన్ మాట్లాడుతూ.. “ఈ వెబ్‌సైట్ ప్రారంభం భారతదేశంలో మున్సిపల్ బాండ్ల మార్కెట్ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అడుగు. నిర్మాణాత్మక డేటా, మార్కెట్ పారదర్శకతను అందించడం ద్వారా, పెట్టుబడిదారులకు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన జ్ఞానం, అవగాహనను ఇది అందిస్తుంది. ఈ వెబ్ సైట్ ఆవిష్కరణ NSE లక్ష్యం, దూర దృష్టికి సరిగ్గా సరిపోతుంది. ప్రజల ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడం, మరింత సమర్థవంతమైన నియంత్రిత బాండ్ మార్కెట్‌ను ప్రోత్సహించడంలో ఇది కీలక ముందడుగు” అని పేర్కొన్నారు. ఈ వెబ్‌సైట్ మున్సిపల్ బాండ్ల మార్కెట్‌లో పెట్టుబడులను సులభతరం చేయడంతో పాటు, దేశంలో స్థిరమైన పట్టణ అభివృద్ధికి బలమైన పునాది వేయడంలో సహాయపడుతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.

నాణ్యతలో రాజీపడం..

హైదరాబాద్‌లోని ఏ‌ఎస్‌బీఎల్, కూకట్‌పల్లి వై జంక్షన్‌ వద్ద తమ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఏ‌ఎస్‌బీఎల్ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్ భూమి పూజ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించింది. ఇది మొత్తం 6.6 ఎకరాల్లో విస్తరించి ఉంది. పట్టణాల్లోని కుటుంబాల అవసరాలను తీర్చే విధంగా ఏఎస్‌‌బీఎల్‌‌ ల్యాండ్‌‌మార్క్‌‌ను డిజైన్ చేశామని కంపెనీ సీఈఓ కొరుపోలు అజితేష్‌‌ అన్నారు. ఇళ్ల నాణ్యతలో రాజీపడమని తెలిపారు.