మండే ఎండలకు చెక్‌పెడుతూ కూల్ కూల్ న్యూస్..! ఇక్కడ సగం ధరకే మీకు నచ్చిన కూలర్లు..
Air cooler Offer: వేసవి కాలం రానే వచ్చేసింది. ఈ యేడు ఎండల తీవ్రత అధికంగా ఉండనుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిస్తోంది. ఇదంతా నిజమే అన్నట్టుగా ఫిబ్రవరి నెల నుంచే ఎండలు మొదలయ్యాయి. దీంతో అనేక మంది అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందడానికి కూలర్లు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇదే సమయంలో కొన్ని ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించాయి. ఆయా వెబ్‌సైట్లు, కూలర్లు, వాటి ధరలు, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

అమెజాన్-ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ కూలర్లు చౌకగా లభిస్తాయి. అవును మీరు విన్నది నిజమే.. ఈ హాట్ సమ్మర్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ కూలర్‌లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చాలా బ్రాండెడ్ కూలర్లు సగం ధరకే అంటే 50శాతం తగ్గింపుతో లభిస్తాయి. ఏయే బ్రాండెండ్ కూలర్లు ఎంత ధరలకు లభిస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
క్రాంప్టన్ 100 లీటర్ కూలర్ కేవలం రూ. 13,399కే:
క్రాంప్టన్ ఆప్టిమస్ 100 లీటర్ల డెసర్ట్ ఎయిర్ కూలర్ అమెజాన్‌లో రూ.13,399కి 38శాతం తగ్గింపుతో లభిస్తుంది. క్రాంప్టన్ నుండి వచ్చిన ఈ గొప్ప కూలర్ ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.. క్రాంప్టన్ నుండి వచ్చిన ఈ కూలర్‌లో అధిక సాంద్రత కలిగిన హనీబీస్ నెట్, పెద్ద, సులభమైన శుభ్రమైన ఐస్ చాంబర్, ఆటో ఫిల్, డ్రెయిన్, ఎవర్‌లాస్ట్ పంప్ ఉన్నాయి.
క్రాంప్టన్ ఆప్టిమస్ 65 లీటర్ల కూలర్ 36శాతం తగ్గింపుతో:
అవును.. క్రాంప్టన్ ఆప్టిమస్ 65 లీటర్ల డెజర్ట్ ఎయిర్ కూలర్ అమెజాన్‌లో 36శాతం తగ్గింపుతో లభిస్తుంది. డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ.12,399 మాత్రమే.
క్రాంప్టన్ 55 లీటర్ కూలర్ రూ. 10,199కి:
దీనితో పాటు, క్రాంప్టన్ 55 లీటర్ల సామర్థ్యం గల కూలర్ కూడా చాలా చౌక ధరకు లభిస్తుంది. దీనిని 51శాతం తగ్గింపుతో అందిస్తున్నారు. దీని ధర రూ.10,199కి తగ్గింది.
హావెల్స్ ఎయిర్ కూలర్ రూ. 6,990 కి:
మీరు ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా హావెల్స్ ఎయిర్ కూలర్ కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో 52శాతం తగ్గింపు తర్వాత కేవలం రూ. 6,990 కు లభిస్తుంది.
లివ్‌ప్యూర్ ఎయిర్ కూలర్ రూ. 8,399కి:
ఇది కాకుండా, లివ్‌ప్యూర్ ఎయిర్ కూలర్‌పై కూడా గొప్ప ఆఫర్ అందుబాటులో ఉంది. 65 లీటర్ల ట్యాంక్ ఉన్న ఈ కూలర్ 53శాతం తగ్గింపుతో లభిస్తుంది. దీనిని రూ.8,399 కు కొనుగోలు చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..