Traffic Challan: ఓరీ దేవుడో.. ట్రాఫిక్ చలాన్లను తప్పించుకోవడానికి యువతి చేసిన ట్రిక్స్ తెలిస్తే.. ఛీ.. ఛీ
పైగా ఆమె తన కారుపై శాంతిభద్రతలకు సంబంధించిన అనేక స్టిక్కర్లను కూడా అతికిస్తుంది. పోలీసులకు పట్టుబడినప్పుడు తన కుటుంబంలో కూడా పోలీసులు ఉన్నారని చెబుతుంది. అయితే, ఇప్పుడు ఆమె చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. దాంతో ఆమె ప్రజల నుండి తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొటోంది.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే మనం జరిమానా చెల్లించాలి. కానీ, ఒక ఒక యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ అయిన యువతి మాత్రం ట్రాఫిక్ చలాన్‌ను ఎలా తప్పించుకోవాలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఆ యువతి ప్రజల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట్ వేగంగా చక్కర్లు కొడుదూ వైరల్‌గా మారింది. ఐవీ బ్లూమ్ అనే అమెరికన్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె ట్రాఫిక్ చలాన్‌ను ఎలా తప్పించుకుంటుందో వివరించింది. అది చూశాక మీరు సైతం నోరెళ్ల బెట్టాల్సిందే..పూర్తి వివరాల్లోకి వెళితే…
అమెరికన్ ఇన్ఫ్లుయెన్సర్ పోస్ట్ ప్రకారం..ఆమె చేసిన స్టంట్స్ తెలిస్తే తొలుత నవ్వకుండా ఉండలేరు. కానీ, ఆ యువతి చేసిన ట్రిక్స్ అన్ని ప్రతిసారీ పనిచేశాయి.. ఆమె దగ్గర చలాన్ చెల్లించడానికి డబ్బు లేదు, కాబట్టి ఆమె చలాన్ నుండి తప్పించుకోవడానికి సాధ్యమైనంతవరకు ప్రయత్నిస్తుంది.
ఇందులో భాగంగా.. ఆమె తన కారులో బూడిద లాంటి పదార్థాన్ని ఉంచుకుంటుంది. ట్రాఫిక్ పోలీసులు కారును అడ్డుకున్నప్పుడు.. తన భర్త ఇటీవల మరణించాడని, అస్తికలు ఇవిగో అంటూ బూడిదను చూపిస్తుంది. అలాగే, పోలీసులు తాను గర్భవతి అని అనుకునేలా ఎప్పుడూ నకిలీ బేబీ బంప్‌తో డ్రైవింగ్ చేయడం, పోలీసులను విచారకరమైన కళ్ళతో చూడటం, ఎలాంటి నొప్పి, బాధ లేకపోయినా ప్రసవ వేదనలో ఉన్నట్లు నటించడం వంటి వింత వింత ప్రయత్నాలు చేస్తుంటుంది. పైగా ఆమె తన కారుపై శాంతిభద్రతలకు సంబంధించిన అనేక స్టిక్కర్లను కూడా అతికిస్తుంది. పోలీసులకు పట్టుబడినప్పుడు తన కుటుంబంలో కూడా పోలీసులు ఉన్నారని చెబుతుంది.
అయితే, ఇప్పుడు ఆమె చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. దాంతో ఆమె ప్రజల నుండి తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొటోంది. ఆమె జాగ్రత్తగా కారు నడుపుతుందా..? లేదంటే, ఎన్ని ప్రమాదాలకు కారణమవుతుందో అంటూ చాలా మంది సందేహం వ్యక్తం చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..