AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auto News: బజాజ్ ప్లాటినా.. హోండా షైన్.. ఇందులో ఏది బెటర్‌.. ఎంత మైలేజీ!

Auto News: ఈ రోజుల్లో మార్కెట్లో రకరకాల బైక్స్‌ విడుదల అవుతున్నాయి. తక్కువ ధరలో మంచి మైలేజీని ఇచ్చే ఇలాంటి బైక్‌లు భారత మార్కెట్లో చాలా ఉన్నాయి. బజాజ్ ప్లాటినా, హోండా షైన్ గురించి తెలుసుకుందాం. ఈ బైక్‌లు ఎంత మైలేజీ ఇస్తాయి..? ధర ఎంత? ఇతర ఫీచర్స్‌ గురించి తెలుసుకుందాం..

Auto News: బజాజ్ ప్లాటినా.. హోండా షైన్.. ఇందులో ఏది బెటర్‌.. ఎంత మైలేజీ!
Subhash Goud
|

Updated on: Jan 01, 2025 | 9:19 PM

Share

ప్రజలు బైక్ కొనడానికి వెళ్లినప్పుడల్లా, సరసమైన ధరలో మంచి మైలేజీని ఇచ్చే బైక్‌ను కొనాలని భావిస్తుంటారు. మెరుగైన మైలేజీకి పేరుగాంచిన ఇటువంటి అనేక బైక్‌లు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్‌లలో బజాజ్ ప్లాటినా, హోండా షైన్ అనే రెండు పాపులర్ బైకులు కూడా ఉన్నాయి. బజాజ్ ప్లాటినా, హోండా షైన్ మధ్య ఏ బైక్ ఎక్కువ మైలేజీని ఇస్తుందో చూద్దాం..

బజాజ్ ప్లాటినా 100:

బజాజ్ ప్లాటినా 100లో కంపెనీ 102 సిసి ఇంజన్‌ని అందించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 7.9 PS పవర్‌తో 8.3 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ బైక్ బరువు దాదాపు 117 కిలోలు. ఈ బైక్‌లో డ్రమ్ బ్రేక్‌లు అందించింది. దీనితో పాటు, 11 లీటర్ ఇంధన ట్యాంక్ కూడా ఉంది. DRL, స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, టాకోమీటర్, యాంటీ-స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్, 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఈ బైక్‌లో కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

హోండా షైన్:

హోండా షైన్ బైక్ గురించి మాట్లాడినట్లయితే.. ఈ శక్తివంతమైన బైక్‌లో 123.94 సిసి, 4-స్ట్రోక్, ఎస్‌ఐ, బిఎస్-VI ఇంజన్‌ని అమర్చారు. ఈ ఇంజన్ 7,500 rpm వద్ద 7.9 kW శక్తిని అందిస్తుంది. 6,000 rpm వద్ద 11 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ ఇంజన్‌తో 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ కూడా అనుబంధించి ఉంది. ఈ బైక్ ఐదు రంగుల ఆప్షన్‌లలో మార్కెట్లో అందుబాటులో ఉంది.

బజాజ్ ప్లాటినా, హోండా షైన్ ఇందులో ఏది మంచిది?

బజాజ్ ప్లాటినా 100 అత్యధిక మైలేజ్ బైక్‌లలో ఒకటిగా పరిగణిస్తారు. బజాజ్ ప్లాటినా 100 మైలేజ్ లీటరుకు 72 కిలోమీటర్లు అని కంపెనీ పేర్కొంది. హోండా షైన్ 55 kmpl మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10.5 లీటర్లు. ఈ బైక్ ఒక్కసారిగా ట్యాంక్‌ను నింపడం ద్వారా 550 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

ఇది కూడా చదవండి: Travel Insurance: కేవలం 45 పైసలకే 10 లక్షల బీమా.. భారత్‌లో చౌకైన ఇన్సూరెన్స్‌ ప్లాన్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి