GST Collections: భారీగా జీఎస్టీ వసూళ్లు.. గత ఏడాది కం టే ఎక్కువే.. ఎంతో తెలుసా..?

GST Collections: 2024 డిసెంబర్‌ నెలలో జీఎస్టీ వసూళ్లు భారీగా వచ్చాయి. రూ.22,490 కోట్ల రీఫండ్‌లను తీసివేసిన తర్వాత, నికర జీఎస్‌టీ వసూళ్లు రూ.1.54 లక్షల కోట్లు. అక్టోబరు, నవంబర్‌లలో జీఎస్టీ వసూళ్లు రూ.1.8 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. జిడిపి మరింత పెరిగే అవకాశం ఉన్నందున, నెలవారీ జిఎస్‌టి వసూళ్లు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు..

GST Collections: భారీగా జీఎస్టీ వసూళ్లు.. గత ఏడాది కం టే ఎక్కువే.. ఎంతో తెలుసా..?
Follow us
Subhash Goud

|

Updated on: Jan 01, 2025 | 9:08 PM

డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,76,857 కోట్లు వచ్చింది. డిసెంబర్ నెలతో పోలిస్తే జనవరి 1, 2023న అధికారికంగా విడుదల చేసిన డేటా ప్రకారం, పన్ను వసూలు శాతం రూ. 7.3 శాతం పెరిగింది. మొత్తం రూ.1,76,857 కోట్ల జీఎస్టీ వసూళ్లలో జీఎస్టీలో కేంద్ర వాటా రూ.32,836 కోట్లు. రాష్ట్ర జీఎస్టీ రూ.40,499 కోట్లు. ఐజీఎస్టీ రూ.47,783 కోట్లు, సెస్ రూ.11,471 కోట్లు. డిసెంబర్‌లో రీఫండ్‌ల సంఖ్య పెరిగింది. నివేదిక ప్రకారం, రూ.22,490 కోట్ల రీఫండ్‌ ఉంది. గతేడాది కంటే 31% రిఫండ్‌ ఉండగా, దీన్ని తీసివేస్తే మిగిలిన నికర జీఎస్టీ రూ.1.54 లక్షల కోట్లు. డిసెంబర్ 2023 కంటే 3.3% ఎక్కువ నికర జీఎస్టీ వచ్చింది. డిసెంబర్ 2024 నెలలో అంతర్గత లావాదేవీల ద్వారా సేకరించిన GST రూ. 1.32 లక్షల కోట్లు. గత ఏడాది కంటే ఇందులో 8.4 శాతం పెరిగింది. ఇంకా దిగుమతులపై పన్ను రూ.44,268 కోట్లు.

డిసెంబర్‌కు ముందు నెలలో అంటే నవంబర్‌లో 1.82 లక్షల కోట్ల జీఎస్టీ వచ్చింది. గత త్రైమాసికంలో జిడిపి రేటు తక్కువగా ఉండటం ఆర్థిక కార్యకలాపాలు మందగించాయనడానికి సంకేతం. దీని ప్రకారం జీఎస్టీ వసూళ్లు కూడా తక్కువే. ఈ త్రైమాసికంలో జిడిపి మరింత పెరిగే అవకాశం ఉన్నందున, నెలవారీ జిఎస్‌టి వసూళ్లు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

2024లో గత నాలుగు నెలల GST వివరాలు

  • సెప్టెంబర్: రూ.1,73,240 కోట్లు
  • అక్టోబర్: రూ.1,87,346 కోట్లు
  • నవంబర్: రూ.1,82,269 కోట్లు
  • డిసెంబర్: రూ.1,76,857 కోట్లు

ఈ ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) ఇప్పటి వరకు 16,33,569 కోట్ల జీఎస్టీ వచ్చింది. గతేడాది కంటే 9.10 శాతం ఎక్కువ పన్ను వచ్చింది. అయితే, 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యం కంటే GST వసూళ్లు తక్కువగా ఉన్నాయి. అంటే 19 శాతం తక్కువ.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి