Madonna Sebastian: అంత పెద్ద హీరోయిన్‌కు ..ఇంత చిన్న చెల్లా!! మడోన్నా ఏమన్నదంటే
అందాల భామ మడోన్నా సెబాస్టియన్ అక్టోబర్ 1, 1992న కేరళలోని చెరుపుజలో జన్మించింది. ఈ అమ్మడు బెంగుళూరులోని క్రైస్ట్ యూనివర్శిటీ నుంచి బిజినెస్ స్టడీలో పట్టాఅందుకుంది. ఈ అమ్మడు మొదట మలయాళంలో విడుదలైన ఒక మ్యూజిక్ షోలో యాంకర్‌గా పని చేసింది. ఈ షో ద్వారా ఫేమస్ అయ్యి తొలిసారి సినిమాల్లో నటించే అవకాశం అందుకుంది.
మడోన్నా సెబాస్టియన్.. ఈ మలయాళ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. నాగచైతన్య నటించిన ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ. తన అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ తెలుగులో అంతగా చెప్పుకోదగ్గ అవకాశాలు అందుకోలేకపోయింది. కానీ మలయాళం, తమిళ్ లోనూ ఈ అమ్మడు క్రేజీ ఆఫర్స్ అందుకుంది. అక్టోబర్ 1, 1992 న కేరళలోని కొచ్చిలో జన్మించింది మడోన్నా సెబాస్టియన్. బెంగుళూరులో కాలేజీ చదువులు పూర్తి చేసిన తర్వాత, దర్శకుడు అల్ఫోన్స్ పుతిరన్ దర్శకత్వం వహించిన 2015 చిత్రం ప్రేమమ్‌తో ఆమె చిత్ర పరిశ్రమలో నటిగా అరంగేట్రం చేసింది. మలయాళంలో ప్రేమమ్ సినిమా ఓ క్లాసిక్ గా నిలిచింది.
మడోన్నా సెబాస్టియన్ ప్రేమమ్ సినిమాలో నటించి అందరికి తెలిసిన విషయమే ఆతర్వాత నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. కాగా తమిళ్ లో స్టార్ హీరోల సినిమాల్లో చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషలలో నటించి ఆకట్టుకుంది. 2024లో ప్రభుదేవాతో కలిసి జాలియో జింఖానా చిత్రంలో నటించింది.
ఈ సినిమా పెద్దగా హిట్ కానప్పటికీ, ఈ చిత్రంలోని మధో పాట ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే మడోన్నా సెబాస్టియన్ ఓ ఇంటర్వ్యూలో తన చెల్లెలు గురించి మాట్లాడిన కామెంట్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఆ ఇంటర్వ్యూలో మడోన్నా మాట్లాడుతూ.. పుట్టినప్పటి నుంచి 18 ఏళ్ల పాటు సింగిల్ చైల్డ్ గా పెరిగాను. 18 ఏళ్ల వయసులో తన తల్లి మళ్లీ గర్భం దాల్చిందని, చెల్లెలు పుట్టిందని తెలిపింది మడోన్నా. ఆ క్షణం చాలా డిఫరెంట్‌గా, హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చింది మడోన్నా.. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.