ఒకే ఓవర్‌లో అత్యధిక బంతులు విసిరిన ఐదుగురు.. లెక్కలు చూస్తే మైండ్ పోద్దంతే

Cricket Records: క్రికెట్ చరిత్రలో ఎన్నో చెత్త రికార్డులు ఉన్నాయి. ఇందులో చేరాలని ఏ ఒక్కరూ కోరుకోరు. అయితే, కొందరు మాత్రం ఊహించని విధంగా ఈ చెత్త రికార్డులను తమ ఖాతాలో వేసుకుంటుంటారు. ఈ క్రమంలో ఒక ఓవర్‌లో అత్యధిక బంతులు విసిరిన చెత్త రికార్డును ఎవరో సొంతం చేసుకున్నారో ఓసారి చూద్దాం..

ఒకే ఓవర్‌లో అత్యధిక బంతులు విసిరిన ఐదుగురు.. లెక్కలు చూస్తే మైండ్ పోద్దంతే
Bowling Records
Follow us
Venkata Chari

|

Updated on: Jan 02, 2025 | 1:54 PM

Cricket Records: క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌కి రనౌట్ కావడం అత్యంత విషాదరకంగా మారుతుంది. అదేవిధంగా బౌలర్‌కు, ఓవర్‌లో 6 కంటే ఎక్కువ బంతులు వేయడం ఇబ్బందికరమైన పరిస్థితిగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ చరిత్రలో, ఒక ఓవర్‌లో అత్యధిక బంతులు వేసిన వారి జాబితాలో ఐదుగురు బౌలర్లు ఉన్నారు. వారు ఎవరో ఓసారి చూద్దాం..

1. బెర్ట్ వాన్స్ (న్యూజిలాండ్): క్రికెట్ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక బంతులు వేసిన ఆటగాడిగా న్యూజిలాండ్ స్పిన్నర్ బెర్ట్ వాన్స్ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. 20 ఫిబ్రవరి 1990న, న్యూజిలాండ్ స్పిన్నర్ బెర్ట్ వాన్స్ వెల్లింగ్టన్ తరపున ఆడుతూ.. కాంటర్‌బరీతో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఒక ఓవర్‌లో గరిష్టంగా 22 బంతులు విసిరాడు. ఈ ఓవర్‌లో 77 పరుగులు ఇచ్చాడు. 1990లో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో కాంటర్‌బరీ ప్లేయర్ లీ జర్మన్ ఒకే ఓవర్‌లో 70 పరుగులు సాధించాడు. కాగా, అతని సహచర ఆటగాడు రోజర్ ఫోర్డ్ 5 పరుగులు చేశాడు.

2. మహ్మద్ సమీ (పాకిస్థాన్): పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సమీ క్రికెట్ మ్యాచ్‌లో ఒక ఓవర్‌లో 17 బంతులు వేసిన చెత్త రికార్డును కలిగి ఉన్నాడు. 2004లో ఆసియా కప్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో మహ్మద్ సమీ ఒకే ఓవర్‌లో 17 బంతులు సంధించాడు. ఇందులో 7 వైడ్లు, 4 నో బాల్స్ ఉన్నాయి.

3. కర్ట్లీ ఆంబ్రోస్ (వెస్టిండీస్): వెస్టిండీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ కర్ట్లీ ఆంబ్రోస్ క్రికెట్ మ్యాచ్‌లో ఒక ఓవర్‌లో 15 బంతులు వేసిన రికార్డును కలిగి ఉన్నాడు. 1997లో పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కర్ట్లీ ఆంబ్రోస్ ఒక ఓవర్‌లో మొత్తం 15 బంతులు వేశాడు. ఇందులో 9 నో బాల్స్ ఉన్నాయి.

4. డారెల్ టఫీ (న్యూజిలాండ్): 2005లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ డారెల్ టఫీ ఒకే ఓవర్‌లో 14 బంతులు సంధించాడు. ఇందులో 4 వైడ్ బాల్స్, 4 నో బాల్స్ ఉన్నాయి.

5. స్కాట్ బోస్వెల్ (ఇంగ్లండ్): ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోస్వెల్, 2001లో సీ అండ్ జీ ట్రోఫీ మ్యాచ్‌లో లీసెస్టర్‌షైర్ తరపున ఆడాడు. సోమర్‌సెట్‌తో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఒక ఓవర్‌లో 14 బంతులు బౌలింగ్ సంధించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి