- Telugu News Photo Gallery Cricket photos Jasprit Bumrah close to Kapil Dev record of most five wickets taken in a bilateral series ahead of IND vs AUS 5th test
IND vs AUS: ప్రమాదంలో 52 ఏళ్ల రికార్డ్.. సిడ్నీలో సరికొత్త చరిత్ర సృష్టించనున్న బుమ్రా
India vs Australia 5th Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరో రెండు రికార్డులపై కన్నేశాడు. 4వ టెస్టులోనే 2 రికార్డులను బద్దలు కొట్టిన బుమ్రా.. సిడ్నీలోనూ సరికొత్త చరిత్రను లిఖించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అవేంటో ఓసారి చూద్దాం..
Updated on: Jan 02, 2025 | 1:10 PM

India vs Australia 5th Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వికెట్లతో చెలరేగిపోతున్నాడు. నాల్గవ టెస్ట్ నాటికి, బుమ్రా రెండు పెద్ద రికార్డులను బద్దలు కొట్టాడు. అత్యంత వేగంగా 200 టెస్ట్ వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచి, ఐసీసీ రేటింగ్‌లో 907 పాయింట్లు సాధించాడు. తాజాగా మరో రెండు మెగా రికార్డులపై కన్నేశాడు. సిడ్నీ టెస్టులో బుమ్రా బ్రేక్ చేసే రికార్డుల వివరాలను ఓసారి చూద్దాం..

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పటి వరకు 4 టెస్టులాడి 30 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. ఈ మైలురాయిని అందుకోవడానికి బుమ్రా కేవలం 5 వికెట్ల దూరంలో ఉన్నాడు. జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరిగే టెస్టు మ్యాచ్‌లో 6 వికెట్లు తీస్తే లెగ్ స్పిన్నర్ బీఎస్ చంద్రశేఖర్ 52 ఏళ్ల రికార్డును బ్రేక్ చేస్తాడు. 1972-73లో ఇంగ్లండ్ పర్యటనలో 35 వికెట్లు తీశాడు.

1977-78లో ఆస్ట్రేలియా పర్యటనలో 5 మ్యాచ్‌ల్లో 31 వికెట్లు తీసిన బిషన్ సింగ్ బేడీ పేరిట విదేశాల్లో ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు. పాకిస్థాన్‌పై 32 వికెట్లు తీసి ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా నిలిచిన కపిల్ దేవ్ రికార్డు కూడా ప్రమాదంలో పడింది.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. మెల్‌బోర్న్‌లో టీమిండియా 184 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు ఇరు జట్లకు చివరి మ్యాచ్ నిర్ణయాత్మకం.

ఆస్ట్రేలియా గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవాలనే ఆశలు అలాగే ఉండాలంటే భారత జట్టు సిడ్నీలో గెలవాల్సిందే. లేదంటే ఈ ఏడాది డబ్ల్యూటసీ ఫైనల్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.





























