ఆ దున్నపోతు మాదంటే మాదే.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న రెండు గ్రామాలు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..
దున్నపోతు తమదంటే తమదంటూ.. రెండు రాష్ట్రాల్లోని రెండు గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.. కర్ణాటకలోని బొమ్మనహాల్ గ్రామానికి, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మేడేహాల్ గ్రామానికి మధ్య ఈ వివాదం తలెత్తింది. చివరకు ఈ వివాదం చినికి చినికి గాలి వానగా మారి మోకా పోలీస్‌స్టేషన్ వరకు చేరింది..
ఓ దున్నపోతు.. రెండు ఊర్లు పొట్టుపొట్టుగా కొట్లాడుకున్నాయి.. ఒక ఊరు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినది.. మరో ఊరు కర్ణాటక రాష్ట్రానికి చెందినది.. కట్ చేస్తే.. ఆ దున్నపోతు తమదంటే తమదంటూ కొట్లాటకు దిగాయి.. దీంతో రెండు రాష్ట్రాల పరిధిలోని రెండు ఊర్ల పంచాయితీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. దున్నపోతుకు సంబంధించిన వివాదం ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కు చేరింది.. దున్నపోతు తమదంటే తమదంటూ.. రెండు రాష్ట్రాల్లోని రెండు గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కర్ణాటకలోని బొమ్మనహాల్ గ్రామానికి, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మేడేహాల్ గ్రామానికి మధ్య ఈ వివాదం తలెత్తింది. చివరకు ఈ వివాదం చినికి చినికి గాలి వానగా మారి మోకా పోలీస్‌స్టేషన్ వరకు చేరింది.. ఇరు వర్గాలు ఈ దున్నపోతు.. తమదంటే తమదంటూ ఘర్షణకు దిగడంతో పాటు.. దున్నపోతు తల్లిని గుర్తించడం ద్వారా నిజమైన యజమాని ఎవరో తేల్చేందుకు DNA పరీక్ష చేయాలని డిమాండ్ చేశాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక కథనం ప్రకారం.. జనవరిలో జరగనున్న దేవి సక్కమాదేవి జాతరకు ముందు బొమ్మన్‌హళ్ గ్రామానికి చెందిన ఐదేళ్ల దున్నపోతు బలి ఇవ్వడానికి ఉంచారు. అయితే, అది మేత కోసం వెళ్తూ దారితప్పింది. ఆ తర్వాత ఆ దున్నపోతు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని మేదేహాల్ గ్రామానికి చేరుకున్నట్లు బొమ్మన్‌హళ్ గ్రామస్థులు చెబుతున్నారు. అయితే.. దున్నపోతు దొరికిందన్న వార్త అందుకున్న బొమ్మన్‌హాల్ ప్రజలు దానిని తీసుకువచ్చేందుకు మేదేహల్‌కు వెళ్లారు.
అక్కడికి చేరుకోగానే బొమ్మన్‌హాల్ గ్రామస్తులకు ప్రతిఘటన ఎదురైంది. అక్కడి ప్రజలు దున్నపోతును ఇవ్వడానికి నిరాకరించారు. ఇరు గ్రామాల ప్రజల మధ్య తీవ్ర వాగ్వాదం జరగింది.. ఇది కాస్త ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇరు గ్రామాల ప్రజలకు గాయాలయ్యాయి. అయితే.. దున్నపోతు తల్లి తమ గ్రామంలోనే ఉందని బొమ్మన్‌హాల్ ప్రజలు చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ, మేడేహాల్ ప్రజలు ఈ దున్నపోతు తమ గ్రామానికి చెందినదని.. దానిని ఇవ్వడానికి నిరాకరించారు.
అనంతరం రెండు గ్రామాల వారు మోకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దున్నపోతు ఏ ప్రాంతానికి చెందినది.. దాని తల్లి ఏది అనే విషయంపై ఇరువర్గాలు DNA పరీక్షను డిమాండ్ చేశాయి. బొమ్మన్‌హాల్‌కు చెందిన బసవంతప్ప దిండిగల్ మాట్లాడుతూ.. తమ గ్రామంలో ప్రతి ఐదేళ్లకోసారి సక్కమాదేవి జాతర జరుగుతుందని, ఆ సమయంలో ఒక దున్నపోతును బలి ఇస్తారని తెలిపారు. బలి ఇవ్వడానికి ఉద్దేశించిన దున్నపోతు మేడేహాల్ లో ఉందని పేర్కొన్నారు.
యాదృచ్ఛికంగా, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌లోని మేడేహాల్ గ్రామంలో ప్రతి మూడేళ్లకోసారి ఇలాంటి పండుగ నిర్వహిస్తారు.. అక్కడ కూడా ఒక దున్నపోతును బలి ఇస్తారు. గ్రామాల మధ్య శాంతియుత పరిష్కారానికి మోకా పోలీసులు సహాయం చేస్తారని ఆశిస్తున్నట్లు బొమ్మన్‌హాల్ గ్రామస్తులు పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు. కాగా.. ఈ ఘటన సంచలనంగా మారింది.