HMPV: మళ్ళీ వైరస్ భయాలు.. HMPV లక్షణాలు ఇవేనా ??
HMPV Symptoms: ఐదేళ్ల కిందటి సీన్ రిపీట్ అవుతోందా? కరోనా కేసులు.. మాస్కులు.. భౌతికదూరాలు.. అన్నిటికీ మించి భయాలు.. మళ్లీ రిపీట్ కాబోతున్నాయా..అంటే పొరుగుదేశంలో కనిపిస్తున్న దృశ్యాలు అవుననే అంటున్నాయి. కరోనా చైనా నుంచే వచ్చింది...ఇప్పుడు HMPV కూడా అక్కడి నుంచే వ్యాప్తి చెందుతోంది. HMPV వైరస్ చైనాలో వేగంగా విస్తరిస్తోంది. రోగులతో చైనా ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.
బీజింగ్, తియాంజిన్, షాంఘై, గువాంగ్‌జూ, హెబోయ్, జెజియాంగ్ రాష్ట్రాల్లో తీవ్రంగా కేసులు నమోదవుతున్నాయి. యునాన్‌లో 121 మంది విద్యార్థులకు HMPV వైరస్ సోకినట్లు తెలుస్తోంది. చైనాలోని పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించారు. కరోనా వైరస్‌కు HMPV వైరస్‌కు దగ్గరి పోలికలున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. శ్వాసవ్యవస్థపైనే వైరస్ దాడి చేస్తోంది. స్వల్పస్థాయి నుంచి తీవ్రస్థాయి ఇన్ఫెక్షన్‌గా మారే ప్రమాదముందని వైద్యులంటున్నారు. ఈ వైరస్ కరోనా మాదిరిగానే తుమ్ములు, దగ్గుతో వ్యాప్తి చెందే అవకాశం ఉందట. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శ్వాస సమస్య, ఆయాసం ఉంటే అనుమానపడాల్సిందేనని అంటున్నారు. పిల్లలు, వృద్ధులు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వ్యక్తులకు ఈ వ్యాధి వేగంగా సోకే ప్రమాదం ఉంది. చేతులు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నారు. HMPV నివారణకు వ్యాక్సిన్ లేదు. వ్యాధి లక్షణాలను తగ్గించేందుకు, మరిన్ని సమస్యలు తలెత్తకుండా నివారణగా మాత్రమే వైద్య చికిత్సను అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా భారత్ లో కూడ 3 కేసులు నమోదు అయ్యాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొత్త ఏడాదిలో గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
ఇక చాయ్, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!