AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sambar Premix Podi: ఈ పొడితో‌.. ఇన్స్‌స్టెంట్‌గా ఇడ్లీ సాంబార్ క్షణాల్లో సిద్ధం..

అప్పటికప్పుడు సాంబార్ తయారు చేసుకోవాలంటే ఎలాగైనా ఓ అరగంట లేదా గంట సమయం పడుతుంది. కానీ ఈ సాంబార్ పొడిని ముందుగానే తయారు చేసి పెట్టుకుంటే.. క్షణాల్లో సాంబార్ సిద్ధం. అప్పటికప్పుడు తయారు చేసుకుని ఇడ్లీ, దోశలకు ఆనందంగా తినొచ్చు.. పెద్దగా సమయం పట్టదు..

Sambar Premix Podi: ఈ పొడితో‌.. ఇన్స్‌స్టెంట్‌గా ఇడ్లీ సాంబార్ క్షణాల్లో సిద్ధం..
Sambar Premix Podi
Chinni Enni
| Edited By: Ram Naramaneni|

Updated on: Jan 04, 2025 | 9:52 PM

Share

ఇడ్లీ సాంబార్ అనేది డెడ్లీ కాంబినేషన్. వేడి వేడి సాంబార్‌లో ఇడ్లీను వేసి తింటూ ఉంటే ఆహా.. స్వర లోకపు అంచుల దాకా వెళ్లినట్టు ఉంటుంది. ఉదయాన్నే సాంబార్ ఇడ్లీ తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. ఇడ్లీకి, దోశలకు, గారెలకు కూడా సాంబార్ అదిరిపోతుంది. మరి అప్పటికప్పుడు సాంబార్ తయారు చేసుకోవాలంటే ఎలాగైనా ఓ అరగంట లేదా గంట సమయం పడుతుంది. కానీ ఈ సాంబార్ పొడిని ముందుగానే తయారు చేసి పెట్టుకుంటే.. క్షణాల్లో సాంబార్ సిద్ధం. అప్పటికప్పుడు తయారు చేసుకుని ఇడ్లీ, దోశలకు ఆనందంగా తినొచ్చు. చెప్పారు కదా ‘పెద్దలు ఈ జన్మమమే రుచి చూడటానికి వేదికరా’ మరి ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉండాలి. మరి ఈ సాంబార్ పొడిని ఎలా తయారు చేసుకుంటారు? కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి.

సాంబార్ పొడికి కావాల్సిన పదార్థాలు:

కంది పప్పు, శనగపప్పు, మినపప్పు, బియ్యం, ఎండు మిర్చి, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మెంతులు, నల్ల మిరియాలు, చింత పండు, పసుపు, ఉప్పు, ఆయిల్.

సాంబార్ పొడి తయారీ విధానం:

ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో కంది పప్పు, శనగపప్పు, మినపప్పు, బియ్యం వేసి ఒకదాని తర్వాత వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్ట్స్ ఎండు మిర్చి, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, చింత పండు, మెంతులు, నల్ల మిరియాలు, కరివేపాకు కూడా వేసి వేయించి పక్కకు తీసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసి ఓ సారి తిప్పి స్టవ్ ఆఫ్ చేయండి. ఇవన్నీ చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇందులో ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించాలి. ఇవి చల్లారాక ఇందులో మిక్సీ పట్టిన పొడిని వేసి ఓ నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ప్రీ మిక్స్ సాంబార్ పొడి సిద్ధం. మీరు సాంబార్ చేయాలనుకుంటే.. చింత పండు రసం తీసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే మీకు నచ్చిన కూరగాయ ముక్కలు, చేసి పెట్టుకున్న పొడి వేసి ఓ పది నిమిషాలు మరిగిస్తే చాలు.. ఇడ్లీలో వేసుకునే సాంబార్ సిద్ధం.