Prawns Popcorn: క్రిస్పీ ప్రాన్స్ పాప్ కార్న్.. స్పెషల్స్‌కి బెస్ట్ స్నాక్..
ఖచ్చితంగా ఇది కూడా పిల్లల ఫేవరేట్ స్నాక్ అయిపోతుంది. ఎప్పుడూ ఇది కూడా చేయమని అడుగుతూ ఉంటారు. చాలా రుచిగా ఉంటుంది. అదే క్రిస్పీ ప్రాన్స్ పాప్ కార్న్. ఇది చేయడం కూడా చాలా సింపుల్. స్పెషల్ డేస్‌కి, ఫంక్షన్స్‌కి మీ పిల్లలకు ఇలా చేసి పెట్టండి. ఖచ్చితంగా మీ ఫ్యాన్ అయిపోతారు..
చికెన్ పాప్ కార్న్.. కేఎఫ్‌సీ తిన్న వారందరికీ తెలుసు. క్రిస్పీగా, సాఫ్ట్‌గా, టేస్టీగా భలేగా ఉంటాయి. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. చాలా మందికి ఇష్టమైన స్నాక్స్‌లో ఇది కూడా ఒకటి. ఇక పిల్లలు అయితే ఇష్టపడి మరీ తింటారు. ఇప్పుడు చెప్పే ఈ స్నాక్ కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా ఇది కూడా పిల్లల ఫేవరేట్ స్నాక్ అయిపోతుంది. ఎప్పుడూ ఇది కూడా చేయమని అడుగుతూ ఉంటారు. చాలా రుచిగా ఉంటుంది. అదే క్రిస్పీ ప్రాన్స్ పాప్ కార్న్. ఇది చేయడం కూడా చాలా సింపుల్. స్పెషల్ డేస్‌కి, ఫంక్షన్స్‌కి మీ పిల్లలకు ఇలా చేసి పెట్టండి. ఖచ్చితంగా మీ ఫ్యాన్ అయిపోతారు. మరి ఈ క్రిస్పీ ప్రాన్స్ పాప్ కార్న్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
క్రిస్పీ పాప్ కార్న్‌కి కావాల్సిన పదార్థాలు:
రొయ్యలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పాలు, మైదా, కారం, ఉప్పు, గరం మసాలా, గుడ్లు, జీలకర్ర, బ్రెడ్ పౌడర్, ఆయిల్, నిమ్మరసం.
క్రిస్పీ పాప్ కార్న్ తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నె తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసిన రొయ్యలను తీసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, నిమ్మరసం పిండి అన్నీ మిక్స్ చేసుకుని ఓ అరగంట సేపు అయినా మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్‌లోకి బ్రెడ్ పొడి, జీలకర్ర, గరం మసాలా, మైదా పిండి వేసి అన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. మరో గిన్నెలోకి ఒక కోడి గుడ్డును, ఒక స్పూన్ పాలు వేసి మిక్స్ చేయాలి. దీన్ని గిన్నెలో కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు రొయ్యలను తీసుకుని ముందుగా గుడ్డు మిశ్రమంలో ముంచి.. ఆ తర్వాత బ్రెడ్ పౌడర్‌లో దొర్లించాలి. ఆ తర్వాత ఆయిల్‌లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఎర్రగా వేయించి సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవాలి. వీటిని టమాటా కిచెప్ లేదా మయోనీస్‌తో తింటే ఆహా రుచి వేరే లేవెల్‌లో ఉంటుంది.