Game Changer Pre Release Event: ‘రామ్ చరణ్‌కు జాతీయ అవార్డు రావాలి’.. గేమ్ ఛేంజర్ ఈవెంట్‌లో శ్రీకాంత్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా శనివారం (జనవరి 04) రాజమండ్రి వేదికగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహంచారు.
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే చిత్ర బృందంతో పాటు పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఈ సినిమాలో సీనియర్ నటుడు శ్రీకాంత్ ఓ కీలక పాత్ర పోషించారు. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ ఈవెంట్‌కు వచ్చిన పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన శంకర్ గారికి థాంక్స్. ఎస్ జే సూర్య గారి నుంచి చాలా నేర్చుకున్నాను. అంజలి గారు, సముద్రఖని గారు ఇలా అన్ని పాత్రలు అద్భుతంగా ఉంటాయి. తమన్ గారు మంచి సంగీతాన్ని అందించారు. సినిమా సినిమాకు రామ్ చరణ్ తన స్థాయిని పెంచుకుంటూనే వెళ్తున్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగే ఉంటాడు. అప్పటికీ ఎప్పటికీ రామ్ చరణ్ బిహేవియర్‌లో ఏమీ మారలేదు. సుకుమార్ గారు చెప్పినట్టు ఈ సినిమాకు జాతీయ అవార్డు రావాలి. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ఇదే కార్యక్రమంలో శంకర్ మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ ఈవెంట్‌కు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు థాంక్స్. నేను నా కూతురి పెళ్లి శుభలేఖ ఇచ్చేందుకు ఆయన దగ్గరకు వెళ్లాను. ఆయన మిమ్మల్ని ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎంతో చక్కగా మాట్లాడారు. ఆయనతో ఉన్న కొన్ని క్షణాల్లోనే ఎంతో నచ్చేశారు. నా ఇన్నేళ్ల కెరీర్‌లో ఒక్క తెలుగు సినిమా చేయలేదు. అయినా నన్ను ప్రేమిస్తూనే వచ్చారు. ఎలాగైనా ఓ తెలుగు సినిమా చేయాలని అనుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారు, రామ్ చరణ్ గారికి థాంక్స్. తెలుగు లొకేషన్లలోనే షూట్ చేశాం. మినిస్టర్, కలెక్టర్‌కు జరిగే వార్ నేపథ్యంలో సినిమా ఉంటుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ అద్భుతంగా ఉంటుంది. రామ్ చరణ్ గారు తన పాత్రల్లో జీవించేశారు. ఎంతో సహజంగా నటించారు. అంజలి గారు, కియారా గారు, శ్రీకాంత్ గారు, నవీన్ చంద్ర గారు, ఎస్ జే సూర్య గారు ఇలా అందరూ చక్కగా నటించారు. తమన్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. నాకు సపోర్ట్ చేసిన నా టీం అందరికీ థాంక్స్’ అని అన్నారు.
గేమ్ ఛేంజర్ ఈవెంట్ లో శ్రీకాంత్ స్పీచ్.. వీడియో
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.