Andhra Cabinet: తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

ఏపీ కేబినెట్ మీటింగ్ ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 14 కీలక అంశాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పిఠాపురం ఏరియా డెవలెప్మెంట్ అథారిటీలో 19 నూతన పోస్టులకు అనుమతి మంజూరుకు కేబినెట్ భేటీలో ఆమోదముద్ర వేశారు. ఇతర కీలక నిర్ణయాలు తెలుసుకుందాం పదండి...

Andhra Cabinet: తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
Andhra Cabinet
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 02, 2025 | 6:31 PM

ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది.  ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది కేబినెట్.  వచ్చే అకడమిక్‌ ఇయర్‌ నుంచి అమ్మ ఒడి చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలానే.. రైతులకు కేంద్రం ఇస్తున్న రూ.10 వేలతో పాటు.. ఏపీ ప్రభుత్వం మరో రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించింది.  మత్స్యకారులకు ఫిషింగ్‌ హాలిడే సమయంలో.. రూ.20 వేలు ఇవ్వాలని ఏపీ కేబినెట్‌ నిర్ణయించిది.

ఓవైపు హామీల అమలు.. మరోవైపు అభివృద్ధే అజెండాగా జరిగిన ఏపీ కేబినెట్‌ మీటింగ్‌లో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 14 అంశాలకు మంత్రి మండలి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  రాజధాని మాస్టర్ ప్లాన్.. అవసరమైన మార్పుల కోసం అర్బన్ చట్టాన్ని సవరించేందుకు కేబినెట్ ఆమోదించింది. సీఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయించిన 2,723 కోట్ల విలువచేసే 2 పనులకు ఆమోదం లభించింది. అలాగే పిఠాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి 18 పోస్టులు మంజూరు చేసింది ప్రభుత్వం.

ఇక TCSకు విశాఖ మిలీనియం టవర్స్‌లో 2.08లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. కాకినాడలో ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్ ఏర్పాటుతో పాటు 592 ఎకరాల్లో రూ.12 వేల కోట్ల పెట్టుబడుల‌కు అమోదం తెలిపింది. 119 మెగావాట్ల విండ్ పవర్, 130 మెగావాట్ల సోలార్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 65వేల కోట్లతో రిలయన్స్‌కు చెందిన 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రి పడకలను 100కి పెంచాలని నిర్ణయించింది. కర్నూలు జిల్లాలో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు… కాకినాడలో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌కు ఓకే చెప్పారు. గతంలో ఆగిపోయిన పనులను పునరుద్దరించాలని నిర్ణయించారు. సూపర్‌ సిక్స్‌పైనా కేబినెట్‌లో చర్చించారు. వీటితో పాటు మరికొన్ని కీలక అంశాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం విడిగా సమావేశం అయ్యారు. జనవరి 8న ప్రధాని మోదీ వైజాగ్‌కు రానున్నారు. ఈ సందర్భంగా ప్రధాని రాష్ట్ర పర్యటనపై కేబినెట్‌లో చర్చించనట్లు తెలుస్తోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు చేస్తారని.. ప్రధాని రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రులకు సీఎం చెప్పినట్లు సమాచారం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి