Andhra News: న్యూ ఇయర్‌కు ఎంజాయ్ చేద్దామని గోవా వెళ్లాడు.. చివరకు శవమై తిరిగొచ్చాడు..

తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందిన 8మంది స్నేహితులు డిసెంబర్ 29న ఆదివారం రాత్రి గోవాలోని ఓ రెస్టారెంట్ లో దిగారు.. కలంగుటే బీచ్‌లోని మెరీనా షాక్ దగ్గర 31న అర్ధ‌రాత్రి ఫుడ్ ఆర్డ‌ర్ విష‌యంలో వీరికి.. హోటల్ సిబ్బందికి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాటా మాటా పెరగడంతో హోటల్‌ సిబ్బంది తేజపై కర్రలతో దాడి చేశారు.

Andhra News: న్యూ ఇయర్‌కు ఎంజాయ్ చేద్దామని గోవా వెళ్లాడు.. చివరకు శవమై తిరిగొచ్చాడు..
Goa Incident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 02, 2025 | 4:43 PM

గోవాలో తాడేపల్లిగూడెం యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నూతన సంవత్సర వేడుకలకు ఆంధ్రప్రదేశ్ నుంచి 8 మంది మిత్రుల బృందం గోవా వెళ్లింది. హోటల్లో ఫుడ్ ఆర్డర్‌ తీసుకునే విషయంలో తలెత్తిన వివాదంతో ఘర్షణ జరిగినట్టు స్థానికంగా వార్తలు వచ్చాయి. రాత్రి 1గంట సమయంలో అదనపు ఫుడ్‌ ఆర్డర్లు తీసుకోవడానికి రెస్టారెంట్‌ నిర్వాహకులు నిరాకరించడంతో వాగ్వాదం మొదలైనట్టు తెలుస్తోంది. ఇదే విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్టు చెబుతున్నారు.

తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందిన 8మంది స్నేహితులు డిసెంబర్ 29న ఆదివారం రాత్రి గోవాలోని ఓ రెస్టారెంట్ లో దిగారు.. కలంగుటే బీచ్‌లోని మెరీనా షాక్ దగ్గర 31న అర్ధ‌రాత్రి ఫుడ్ ఆర్డ‌ర్ విష‌యంలో వీరికి.. హోటల్ సిబ్బందికి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాటా మాటా పెరగడంతో హోటల్‌ సిబ్బంది తేజపై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. హోటల్ సిబ్బంది దాడిలో తీవ్రగాయాలతో తేజ మృతి చెందినట్టు నార్త్ గోవా ఎస్పీ అక్షత్ కౌశల్ తెలిపారు.

కేసు నమోదు చేసిన పోలీసులు నేపాల్ కు చెందిన హోటల్‌ యజమాని అగ్నెల్ సిల్వేరా అతని కుమారుడు షుబర్ట్ సిల్వేరియా, పనిచేసే సిబ్బంది అనిల్ బిస్తా, సమల్ సునార్లను అరెస్టు చేశారు.

ఇదలా ఉంటే.. రెస్టారెంట్‌లో కొందరు యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని, అదే విషయంలో గొడవ జరిగిందంటున్నారు మృతుడి బంధువులు.. రెస్టారెట్ ఓనర్ కొడుకు అసభ్యకరంగా ప్రవర్తించడంతోనే గొడవ జరిగిందని.. కర్రలతో దాడి చేశారని పేర్కొంటున్నారు.

ఈ వ్యవహారంపై బాధితుల సమాచారంతో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు.. దీంతో అధికారులు గోవా ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు.. దీంతో అక్కడి పోలీసులు రవితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.. అనంతరం ప్రత్యేక విమానంలో తాడేపల్లిగూడెంకి తరలించారు. అనంతరం స్వస్థలంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..