Telangana: స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి.. ప్రజలకు శుభవార్తలు చెప్పిన సీఎం రేవంత్..

వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా నిధులు ఇవ్వనున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకం కింద ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.12వేలు ఇవ్వనున్నారు. భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Telangana: స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి.. ప్రజలకు శుభవార్తలు చెప్పిన సీఎం రేవంత్..
Revanth Reddy
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 04, 2025 | 9:41 PM

తెలంగాణ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వయంగా సీఎం రేవంత్ కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రతి ఎకరానికీ ఏటా రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం ప్రకటించారు. వీటితో పాటు భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ కింద  ఏటా రూ.12 వేలు సాయం అందించేందుకు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సీఎం వెల్లడించారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు పంపిణీ జరగనుంది. ఇక  ఫిబ్రవరి నుంచి సన్నబియ్యం పంపిణీ జరగనుంది.

ఇతర కేబినెట్ నిర్ణయాలు:

  • పంచాయతీరాజ్‌లో 508 కారుణ్య నియామకాలు
  • కొత్త గ్రామ పంచాయతీలకు కేబినెట్‌ ఆమోదం
  • -పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు జైపాల్ రెడ్డి పేరు
  • -పాలమూరు ప్రాజెక్టు ప్యాకేజీ-2 వ్యయం రూ.1,784 కోట్లకు పెంపు
  • -పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌లో 588 కారణ్య నియామకాలకు ఆమోదం
  • -56 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో వీలినానికి గ్రీన్‌సిగ్నల్
  • -టూరిజం, క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ పాలసీ, సాగునీటి సంఘాల పునరుద్ధరణ

సీఎం వెల్లడించిన కేబినెట్ నిర్ణయాలను దిగువన వీడియోలో చూడండి…. 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి