Ram Charan : గేమ్ ఛేంజర్‌ కోసం సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న చెర్రీ.. ఏంటో తెలుసా..

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని జనవరి 10న విడుదల చేయనున్నారు. తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ కోసం సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నారట చరణ్. ఇంతకీ ఏంటో తెలుసా..?

Ram Charan : గేమ్ ఛేంజర్‌ కోసం సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న చెర్రీ.. ఏంటో తెలుసా..
Ram Charan New Look
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajitha Chanti

Updated on: Jan 04, 2025 | 8:22 PM

మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ గేమ్ చేంజర్‌. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్‌ ఫిలిం సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. చెర్రీ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం విషయంలో సక్సెస్‌ అయిన ఓ ఫార్ములాను గేమ్ ఛేంజర్‌లోనూ రిపీట్ చేయబోతున్నారట మేకర్స్‌. చరణ్ కెరీర్‌లో మైల్‌ స్టోన్‌ లాంటి మూవీ రంగస్థలం. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిట్టిబాబుగా అదరగొట్టారు చరణ్‌. ఈ సినిమాతోనే ఫస్ట్ టైమ్‌ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా చెవుడుతో ఇబ్బంది పడే వ్యక్తిగా మెగా పవర్‌ స్టార్‌ నటన ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది.

కేవలం క్యారెక్టర్‌ను డిఫరెంట్‌గా చూపించడానికి అన్నట్టుగా కాకుండా చిట్టిబాబుకు ఉన్న చెవుడు కారణంగానే కథను మలుపు తిప్పటం రంగస్థలం సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. అందుకే ఇప్పుడు గేమ్ ఛేంజర్ విషయంలోనూ అదే ఫార్ములాను రిపీట్ చేయబోతున్నారట. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో రెండు డిఫరెంట్ రోల్స్‌లో కనిపించబోతున్నారు చెర్రీ. అందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో వచ్చే అప్పన్న పాత్ర నత్తితో ఇబ్బంది పడే పాత్ర అన్న టాక్ వినిపిస్తోంది.

కేవలం క్యారెక్టర్‌ను కొత్తగా చూపించడానికి అన్నట్టుగా కాకుండా, ఆ క్యారెక్టర్‌కు ఉన్న నత్తి కారణంగానే కథ మలుపు తిరిగేలా స్క్రీన్‌ప్లే డిజైన్ చేశారట దర్శకుడు శంకర్‌. మరి రంగస్థలం విషయంలో వర్కవుట్ అయిన ఫార్ములా గేమ్ చేంజర్‌కు ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.