అయ్యబాబోయ్..! లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లక్ష్మీ అరాచకం..!!మరీ ఇంత హాట్‌గా ఉందేంటి గురూ..
అదేంటో స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలో చేసిన హీరోయిన్లందరూ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి గాయబ్ అవుతుంటారు. అప్పటి వరకు మనకు తెగ నచ్చేసి.. మనతో వారి గురించే ఆరా తీసేలా చేసుకుని.. ఫ్యూచర్‌లో స్టార్ హీరోయిన్ అవుతారనే నమ్మకాన్ని మనకు కలిగించి, ఉన్నట్టుండి చట్టుక్కున మాయం అవుతుంటారు. కనీసం సోషల్ మీడియాలో వెతికినా కనబడనంత దూరంగా దాక్కొంటారు.
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఆకట్టుకునే కథలకు కేరాఫ్ అడ్రస్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలన్నీ మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటాయి. శేఖర్ కమ్ముల ఎంచుకునే కథలు మన రోజువారీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. మన చుట్టుపక్కల జరిగే కథలను ఆధారంగానే శేఖర్ కమ్ముల సినిమాలు ఉంటాయి. ఇక ఆ సినిమాల్లో హీరోయిన్లు కూడా మనమధ్య తిరిగే సాధారణ అమ్మాయిల్లానే ఉండేలా చూసుకుంటారు శేఖర్ కమ్ముల. ఆనంద్ నుంచి మొదలు పెడితే మొన్న వచ్చిన లవ్ స్టోరీ వరకు ప్రతి సినిమా అంతే. ఇక శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా కూడా అంతే మన మధ్య జరిగే కొన్ని అందమైన ప్రేమకథలను ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు శేఖర్.
ఈ సినిమాలో జంటగా నటించిన అభిజిత్- షగున్ కౌర్, సుధాకర్-జారా సాశ్ అందరికి గుర్తుండే ఉంటారు. అయితే ఈ సినిమా తర్వాత ఈ హీరోలు ఒకటి రెండు సినిమాల్లో నటించారు. కానీ హీరోయిన్లు మాత్త్రం కనిపించలేదు. ఇక ఈ సినిమాలో సుధాకర్ కు జోడీగా నటించిన లక్ష్మీ అలియాస్ జారా సాశ్. సినిమాలకు దూరంగా ఉంటుంది. లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాలో ఈ చిన్నది తన అందంతో కవ్వించింది. అమాయకపు అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది.
ఇక ఈ చిన్నది సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలు చూస్తే బుర్ర పాడవ్వల్సిందే. జారా సాశ్ ను ఇప్పుడు గుర్తుపట్టడంకష్టమే . లైఫ్ ఈజ్ బ్యూటీ సినిమాలో పద్దతిగా లంగాఓణిలో కనిపించిన ఈ భామ. బయట చాలా హాట్ గురూ..! ఇప్పుడు హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంతలా మారిపోయిందేంటీ అంటూ అవాక్ అవుతున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.