Game Changer: గేమ్ ఛేంజర్ మాస్ రాంపెజ్.. ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన మేకర్స్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఇంతకీ ట్రైలర్ టాక్ ఎలా ఉందో చూద్దామా.
గేమ్ చేంజర్ విషయంలో ఇన్నాళ్లుగా ఆడియన్స్‌లో ఉన్న అన్ని అనుమానాలకు చెక్ పెట్టేశారు దర్శకుడు శంకర్. హైదరాబాద్‌లో జరిగిన తొలి గేమ్ చేంజర్ ఈవెంట్‌లో ట్రైలర్ లాంచ్ చేసిన మేకర్స్, మెగా అభిమానుల్లో జోష్ నింపారు. ఇదే జోష్ సినిమా రిలీజ్ తరువాత కూడా కంటిన్యూ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉంది మూవీ టీమ్.
గేమ్ చేంజర్ నుంచి సాలిడ్ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఫైనల్‌గా ఫుల్ ట్రీట్ ఇచ్చింది మూవీ టీమ్. అదిరిపోయే ట్రైలర్‌తో అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది యూనిట్. ట్రైలర్‌లో చరణ్ లుక్స్ డైలాగ్స్‌కు ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్‌గా సినిమా అవుట్‌పుట్ చూసిన నిర్మాత దిల్ రాజు, ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. స్టేజ్ మీద తొడ కొట్టాలనిస్తుందంటూ తన ఎగ్జైట్మెంట్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. ఫుల్ సినిమా అంతకు మించి ఉంటుందంటూ హామీ ఇచ్చారు.
ఐయామ్ అన్ ప్రిడిక్టబుల్ అంటూ ట్రైలర్‌లో అదిరిపోయే వేరియేషన్స్ చూపించారు చెర్రీ. మూడు డిఫరెంట్ లుక్స్‌తో చరణ్ అదరగొట్టారు. ట్రైలర్ చరణ్‌తో పాటు లీడ్ యాక్టర్స్ అందరికీ స్పేస్ ఇచ్చారు దర్శకుడు శంకర్. హీరోయిన్ కియారాతో పాటు ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, అంజలి, ఇలా ప్రతీ క్యారెక్టర్‌ను ట్రైలర్‌లోనే పరిచయం చేశారు.
కార్తీక్ సుబ్బరాజ్ కథతో శంకర్ తెరకెక్కించిన గేమ్ చేంజర్ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిమానులు దాదాపు మూడేళ్లుగా ఎదురుచూస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్‌తో ఆ రేంజ్ కంటెంట్‌తోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నామన్న కాన్ఫిడెన్స్ ఇచ్చారు మేకర్స్.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.