రమ్య కృష్ణ.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. గతంలో ఓ సారి నరసింహ, బాహుబలి సినిమాలు గురించి ఈమె ఇలా అన్నారు.
ఈ మూవీ ప్రమోషన్స్‌లో రమ్యకృష్ణ మాట్లాడుతూ ‘నరసింహ’ సినిమాలో నీలాంబరి పాత్ర తన కెరీర్‌ను మలుపు తిప్పిందని చెప్పారు.
‘‘నరసింహ’లో అవకాశం వచ్చినప్పుడు మొదటి హీరోయిన్‌నా.. రెండో హీరోయిన్‌నా.. ఇలా ఏం ఆలోచించలేదు. రజనీకాంత్ సినిమాలో నేను భాగం కావాలనుకున్నాను.
అందుకే వెంటనే ఓకే చెప్పాను. నా జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయమదే. ఆ సినిమాలో సౌందర్య ముఖం మీద నేను కాలు పెట్టే సన్నివేశం ఉంటుంది.
ఆ సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అని భయపడ్డాను అన్నారు. ఈ చిత్రం తర్వాత మళ్లీ 2023లో 24 ఏళ్లకు ‘జైలర్’ మూవీలో రజనీకాంత్‌తో కలిసి నటించారు.
ఇక ‘బాహుబలి’ నాకు మరో బిగ్గెస్ట్ హిట్‌ను అందించింది. ఆ మూవీ ఇంతపెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదని అన్నారు.
ఈ చిత్రం సమయంలో ‘రాత్రిపూట షూటింగ్ చేయను, కొద్దిరోజులు మాత్రమే సమయం ఇస్తాను..’ అనే షరతులకు రాజమౌళి అంగీకరించారు’’ అని తెలిపారు
బాహుబలి 1 అండ్ 2లో రాజమాత శివగామి దేవిగా ఇది నా మాట.. నా మాటే శాసనం అంటూ పవర్ఫుల్ లేడీ పాత్రలో ఆకట్టుకున్నారు.