లోకేష్‌ కోసం సూర్య తమ్ముడినే పక్కన పెట్టేశారా.? 

05 January 2025

Battula Prudvi

ఆకాశం నీ హద్దురా సినిమా గుర్తుందా? తమిళ స్టార్ హీరో సూర్యకి నేషనల్‌ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా.

మాస్‌ హీరోలను సుధ కొంగర ఈజ్‌తో డీల్‌ చేస్తారని మళ్లీ ప్రూవ్‌ చేసిన సినిమా. అందుకే ఆ సినిమాను మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటుంటారు సూర్య ఫ్యాన్స్.

తన కెరీర్‌లో అంత మంచి సినిమా ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ గా ఇంకో సినిమాకు కాల్షీట్‌ ఇచ్చారు హీరో సూర్య.

సుధ డైరక్షన్‌లో సూర్య, కార్తి ఇద్దరూ కలిసి నటిస్తారనే ప్రచారం సాగింది. అయితే కార్తి ప్లేస్‌ని దుల్కర్‌ సల్మాన్‌తో రీప్లేస్‌ చేశారనే వార్తలు గుప్పుమన్నాయి.

సుధ డైరక్షన్‌లో చేసే సినిమాలో కార్తి ప్లేస్‌ని దుల్కర్‌ రీప్లేస్‌ చేయడానికి ఓ రీజన్‌ ఉందని అంటున్నారు క్రిటిక్స్.

ఆ రీజన్‌కు పేరు లోకేష్‌ అన్నదే అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్న విషయం. లోకేష్‌ కనగరాజ్‌ డైరక్షన్‌లో ఆల్రెడీ విక్రమ్‌ మూవీలో రోలెక్స్ కేరక్టర్ చేశారు సూర్య.

ఇప్పుడు ఆ కేరక్టర్‌ ప్రధానంగా ఓ సినిమాను డిజైన్‌ చేస్తున్నారు. సుధ సినిమా కంప్లీట్‌ కాగానే లోకేష్‌ సెట్స్ కి వెళ్తారు సూర్య.రోలెక్స్ మూవీలో కార్తి ఖైదీని ఇంక్లూడ్‌ చేశారట లోకేష్‌.

బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు సినిమాల్లో అన్నాదమ్ములు కనిపించడం ఎందుకు అని ఆలోచించి, సుధ మూవీకి దుల్కర్‌ని సజెస్ట్ చేశారట సూర్య.