ఆ మూవీకి మ్యూజిక్ ‎ డైరెక్టర్‎గా కమెడియన్ సప్తగిరి..

04 January 2025

Battula Prudvi

కమెడియన్ సప్తగిరి అంటే తెలియని వారుండరు. సినిమాలలో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంటారు ఆయన.

ఆయన అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. సప్తగిరి సొంత ఊరు ఐరాల. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉంది.

భాస్కర్ దర్శకత్వంలో సిద్దార్థ్, జెనీలియా జంటగా వచ్చిన బొమ్మరిల్లు చిత్రానికి సహాయ దర్శకుడుగా పని చేశారు.

తర్వాత భాస్కర్ దగ్గరే అల్లు అర్జున్ పరుగు మూవీకి అసోసియేట్ డైరెక్టర్‎గా చేశారు. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో సప్తగిరి కనిపించారు.

తర్వాత కందిరీగ, గబ్బర్ సింగ్, జులాయి, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వంటి హిట్ చిత్రాల్లో కమెడియన్‎గా నటించి మెప్పించారు.

అయితే 2013లో సుధీర్ బాబు, నందిత జోడీగా నటించిన హారర్ కామెడీ ప్రేమ కథ చిత్రంలో కమెడియన్‎గా సప్తగిరి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

దీని తరవాత కమెడియన్‎గా ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్ కమెడియన్స్ లిస్ట్ లో చేరారు. ఇదిలా ఉంటే ఒక సినిమాకి సంగీత దర్శకుడుగా పని చేశారు.

ఆ సినిమా ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా.. 2022లో కిరణ్ అబ్బవరం సమ్మతమే చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‎గా స్వరాలందించారు.