మల్టీ టాలెంటెడ్ బ్యూటీ శృతి హాసన్ గతంలో డిఫరెంట్ థీమ్‌తో మాన్‌స్టర్ మెషీన్ అనే పేరుతో ఓ ఇంట్రస్టింగ్ సింగిల్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చారు.
తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కానగరాజ్, హీరోయిన్ శృతి హాసన్ కలిసి చేసిన ఇనిమెల్ అనే కవర్ సాంగ్ ప్రేక్షకులను మెప్పించింది.
శ్రుతి హాసన్ లాగే మల్టీపుల్ టాస్క్‌లతో బిజీగా ఉంటున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ మ్యూజిక్ కంపెనీ కోసం ఓ వీడియో సింగిల్ చేశారు.
రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు మాత్రమే కాదు అంతకు ముందే ఇలాంటి ప్రయోగాలు చేసిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు.
ఆ మధ్య గాంథారీ గాంథరీ అంటూ మాస్ స్టెప్స్‌తో రచ్చ చేశారు మహానటి కీర్తి సురేష్. ఇది సినిమా సాంగే అనుకున్నా కాస్త ఆలస్యంగా వీడియో సింగిల్ అన్న క్లారిటీ వచ్చింది.
ప్రముఖ బాలీవుడ్ సింగర్ బాద్‌షాతో కలిసి రెట్రో పాండ యూనివర్స్‌లో తబాహీ అనే కవర్ సాంగ్‌లో నటించారు మిల్కీ బ్యూటీ తమన్నా.
హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీకి ముందే రష్మిక కూడా ఓ హిందీ సింగిల్‌లో ఆడిపాడారు. సౌత్ నార్త్ కాంబినేషన్‌లో టాప్ టక్కర్ సాంగ్ బాలీవుడ్ ఎంట్రీకి టీజర్‌లా పనికొచ్చింది.
తెలుగులో అవకాశాల కోసం చూస్తున్న వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ లడీ లడీ అనే మాస్ బీట్ సాంగ్‌లో నటించటమే కాదు స్వయంగా పాడి మరీ ఆకట్టుకున్నారు.