ట్రిపుల్ రోల్స్‌తో సత్తా చాటిన తెలుగు హీరోలు వీరే..
05 January 2025
Battula Prudvi
జై లవకుశ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేసి ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ జై (రావణ్), లవ, కుశ పాత్రల్లో నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది.
కళ్యాణ్ రామ్ కూడా అమిగోస్ చిత్రంలో త్రిపాత్రాభినయం చేశారు. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.
అధినాయకుడు చిత్రంలో నందమూరి బాలకృష్ణ ట్రిపుల్ రోల్ లో నటించినప్పటికీ ఈ చిత్రం నందమూరి అభిమానుల్లో నిరాశ మిగిల్చింది.
మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా, డాన్సర్ గా, గల్లీ రౌడీ గా త్రిపాత్రాభినయం చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
దానవీరశూరకర్ణ చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్ కర్ణుడిగా, దుర్యోధనుడిగా, శ్రీ కృషుడిగా త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకుల మనుసులు దోచేశారు.
అక్కినేని నాగేశ్వర్రావు కూడా నవరాత్రి చిత్రంలో ట్రిపుల్ రోల్ లో ఆకట్టుకున్నారు. డాక్టర్, గన్ మాన్, పల్లెటూరి వ్యక్తిగా మెప్పించారు.
అత్యధికంగా 'రక్త సంబంధం', 'బంగారు కాపురం', 'సిరిపురం మొనగాడు', 'పగబట్టిన సింహం' అనే నాలుగు చిత్రాల్లో త్రిపాత్రాభినయం చేసి మెప్పించారు సూపర్ స్టార్ కృష్ణ.
శోభన్ బాబు ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అప్పట్లో అయన సినిమాలకు ఆడవాళ్లలో మంచి క్రేజ్ ఉండేది.