సెకండ్ ఇన్నింగ్స్‎లో చిరు.. హిట్స్ ఎన్ని.. 

06 January 2025

Battula Prudvi

2007లో జై చిరంజీవ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లో రాణించారు మెగాస్టార్ చిరంజీవి. మళ్లీ పదేళ్ల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.

2017లో వచ్చిన ఖైదీ నెం. 150 చిరు సెకండ్ ఇన్నింగ్స్‎లో తొలి చిత్రం. తమిళ్ కత్తికి రీమేక్‎గా రూపొందిన ఈ సినిమా హిట్ అయింది.

తర్వాత 2019లో వచ్చిన హిస్టారికల్ మూవీ సైరా నరసింహారెడ్డిలో నటించారు. ఈ సినిమాకి ఎవరేజ్ టాక్ వచ్చినప్పటికీ భారీ వసూళ్లు చేసింది.

2022లో కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వచ్చిన ఆచార్య డిజాస్టర్‎గా నిలిచింది. ఇందులో చెర్రీ కీలక పాత్రలో నటించారు.

అదే ఏడాది వచ్చిన గాడ్ ఫాదర్ ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా మోహన్ లాల్ లూసిఫర్ మూవీకి రీమేక్‎గా వచ్చింది.

దీని తర్వాత 2023 సంక్రాంతి కనుకగా వచ్చిన వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీ 200 కోట్లకు పై వసూళ్లు చేసింది.

అదే ఏడాది తమిళ హిట్ వేదాళంకి రీమేక్‎గా మెహర్ రమేష్ తెరకెక్కించిన భోళా శంకర్ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది.

దీంతో త్వరతి సినిమాలపై బాగా దృష్టి పెట్టిన మెగాస్టార్ విశ్వంభర అనే సోసియో ఫాంటసీ సినిమాలో సిద్ధం అవుతున్నారు.