తారక్ గాత్రం అందించిన సాంగ్స్ ఇవే.. 

06 January 2025

Battula Prudvi

జూనియర్ ఎన్టీఆర్.. మల్టీ టాలెంటెడ్ హీరో.. ఆయన పేరు చెబితే గుర్తువచ్చేది డైలాగ్ డెలివరీ, అద్భుతమైన యాక్టింగ్.. డ్యాన్స్.

కేవలం డాన్స్, యాక్టింగ్ కాదు.. సింగర్‏గా మెప్పించారు. కొన్ని సినిమాల్లో ఎన్టీఆర్ పాడిన సాంగ్స్ ఏంటో తెలుసుకుందాం.

సుకుమార్ దర్శకత్వంలో తారక్ హీరోగా వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాలో.. ఫాలో ఫాలో సాంగ్ ఆలపించారు. ఈ పాట హిట్ అయ్యింది.

రాకాసి రాకాసి.. అనే పాటతో మరోసారి సింగర్‏గా అదరగొట్టారు టాలీవుడ్ యంగ్ టైగర్. ఈ సాంగ్ రభస చిత్రంలోనిది.

చారీ (వేర్ ఈజ్ ది పంచకట్టు).. అనే పాటకు మరోసారి గాత్రం అందించారు కొమరం భీం. ఈ సాంగ్ అదుర్స్ మూవీలోనిది.

అయన మెహర్ రమేష్ తెరకెక్కించిన కంత్రిలో 1,2,3 నేనొక కంత్రి అనే పాటతో అలరించారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.

ఇక రాజమౌళి దర్శత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన యమదొంగ చిత్రంలోని ఓలమ్మి తిక్క రేగిందా సాంగ్ ఆలపించారు తారక్.

తారక్ తెలుగులో మాత్రమే కాదు.. కన్నడలోనూ సాంగ్స్ పాడారు. చక్రవ్యూహా మూవీలో గెలేయా గెలీయా అనే సాంగ్ పాడారు.