SIIMA అవార్డ్స్ అందుకున్న తెలుగు డైరెక్టర్స్ వీరే..

06 January 2025

Battula Prudvi

రాజమౌళి 2015లో బాహుబలి: ది బిగినింగ్, 2017లో బాహుబలి 2: ది కన్‌క్లూజన్, 2022లో ఆర్ఆర్ఆర్ సినిమాలకు 3 సైమా అవార్డులు అందుకున్నారు.

సుకుమార్ 2018లో రంగస్థలం, 2021లో పుష్ప: ది రైజ్ సినిమాలకు ఉత్తమ దర్శకుడుగా రెండు సైమా అవార్డులు అందుకున్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా రెండు సైమా అవార్డులు అందుకున్నారు. 2013లో అత్తారింటికి దారేది, 2020లో అలా వైకుంఠపురములో సినిమాలకు లభించాయి.

2016లో ఊపిరి, 2019లో మహర్షి చిత్రాలు దర్శకత్వానికి వంశీ పైడిపల్లిని రెండు బెస్ట్ డైరెక్టర్ అవార్డులు వరించాయి.

సురేందర్ రెడ్డి 2014లో అల్లు అర్జున్ హీరోగా దర్శకత్వం వహించిన రేసు గుర్రం మూవీకి బెస్ట్ డైరెక్టర్‎గా సైమా అవార్డు లభించింది.

2012లో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన చిత్రం గబ్బర్ సింగ్. దీనికి హరీష్ శంకర్‎కి సైమా ద్వారా బెస్ట్ డైరెక్టర్ అవార్డు లభించింది.

2011లో మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ చిత్రం దూకుడు సినిమాకి ఉత్తమ దర్శకుడు సైమా అవార్డు లభించింది.

2023లో నాని హీరోగా తెరకెక్కిన దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకి బెస్ట్ డైరెక్టర్‎గా సైమా అవార్డు లభించింది.