అవమానిస్తే చూస్తూ ఊరుకోను.. వ్యాపార వేత్తకు బాలయ్య బ్యూటీ స్ట్రాంగ్ వార్నింగ్!

06 January 2025

TV9 Telugu

మలయాళ బ్యూటీ హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమాతో తెలుగు అభిమానులకు దగ్గరైంది.

  అయితే తాజాగా ఈ అమ్మడును ఓ వ్యాపారవేత్త వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది. కావాలనే ఇంటర్వ్యూలలో నా గురించి తప్పుగా మాట్లాడారు.

తాను కావాలనే ఏ చిన్న అవకాశం దొరికినా సరే నా గురించి మీడియాకు తప్పుగా చెప్తూ నన్ను అవమానిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

నేను ఎప్పుడూ సెలబ్రిటీలతోపాటు బిజినెస్‌కు సంబంధించిన ఈవెంట్స్‌కు అటెండ్ అయ్యేదాన్ని, కానీ ఈ వ్యాపారవేత్త చేసే తప్పుడు కామెంట్స్ వలన ఈవెంట్స్‌కు వెళ్లడం లేదు.

అతను కావాలనే నేను వెళ్లే కార్యక్రమాలకు అటెండ్ అవుతూ, నా గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేసింది.

అయినా నేను ఈ వేధింపులను అస్సలే భరించను, ఆ బిజినెస్ మ్యాన్‌కు నా పేరు వాడితే చాలు ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందని భావిస్తున్నారని పేర్కొంది.

నేను సోషల్ మీడియాలో డబుల్ మీనింగ్ జోక్స్, ట్రోలింగ్స్ ‌ను వదిలేయను తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను, ప్రతిదానికి చట్టపరంగానే సమాధానం చెబుతానంది.

అంతేకాకుండా మానసిక రోగులను నేను ఎప్పుడు పట్టించుకోలేదని, తప్పకుండా చర్యలు తీసుకుంటాను, ఎవరినీ వదలనంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.