అందాల తార అనసూయ ఏం చదువుకుందో తెలుసా?

06 January 2025

Basha Shek

ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ లో న్యూస్ ప్రజెంటర్‌ గా కెరీర్ ప్రారంభించింది అందాల తార అనసూయ భరద్వాజ్.

ఆ తర్వాత యాంకర్ గా అదృష్టం పరీక్షించుకుంది. జబర్దస్త్ కామెడీ షో అనసూయకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

ఓ వైపు బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై సత్తా చాటిందీ అందాల తార. సహాయక నటిగా మెప్పించింది.

సోగ్గాడే చిన్ని నాయన, క్షణం, రంగస్థలం, పుష్ప తదితర సినిమాల్లో అనసూయ పాత్రలకు మంచి పేరువచ్చింది.

ఇటీవల రిలీజైన పుష్ప 2 సినిమాలోనూ దాక్షాయణిగా మెప్పించిన అనసూయ ప్రస్తుతం సినిమాల్లోనే ఎక్కవగా కనిపిస్తోంది

అన్నట్లు అనసూయ ఏం చదువుకుందో తెలుసా? 2008లో భద్రుకా కాలేజీలో ఎంబీఏ పూర్తి చేసిందీ అందాల తార.

చదువు అయిపోయిన తర్వాత కొన్ని రోజులు ఓ ప్రముఖ కంపెనీలో హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ గా బాధ్యతలు కూడా నిర్వర్తించింది.

ఇక ఆ తర్వాత యాంకర్ గా , నటిగా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ.