Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు
Railway Passengers Alert: సంక్రాంతి రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల ప్రయాణీకుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఆ మేరకు ఆరు సర్వీసుల అదనపు రైళ్లను సోమవారంనాడు ప్రకటించింది. వీటిలో రిజర్వేషన్లు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు సంక్రాంతి పండక్కి వెళ్లి రావాలనుకునే వారికి ఈ ప్రత్యేక రైళ్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి.
Sankranti Special Trains: సంక్రాంతి రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల మధ్య పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించింది. దీనికి అదనంగా మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడపున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) సోమవారంనాడు ప్రకటించింది. కాచిగూడ – శ్రీకాకుళం రోడ్‌కు జనవరి 11, 15వ తేదీలు, శ్రీకాకుళం రోడ్ – కాచిగూడకు జనవరి 12, 16 తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. అలాగే చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్‌కు జనవరి 8వ తేదీన ఓ ప్రత్యేక రైలును నడపనుండగా.. శ్రీకాకుళం రోడ్ – చర్లపల్లికి జనవరి 9న మరో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్ల తెలిపింది. ఈ ఆరు ప్రత్యేక రైళ్లకు సంబంధించిన బుకింగ్ ప్రారంభమయ్యింది.
కాచిగూడ- శ్రీకాకుళం రోడ్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు, మల్కాజ్‌గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ ప్రత్యేక రైలులో అన్ని 3 ఏసీ కోచ్‌లు ఉంటాయి.
అలాగే చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 1 ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని రైల్వే శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
అదనపు సంక్రాంతి ప్రత్యేక రైళ్ల వివరాలు..